ETV Bharat / sitara

యూట్యూబ్​లో 'ఇస్మార్ట్​ శంకర్​'కు రికార్డ్ వ్యూస్​ - ఇస్మార్ట్​ శంకర్​ హిందీ వర్షన్​కు 200 మిలియన్​ వ్యూస్​

హీరో రామ్​- దర్శకుడు పూరీ జగన్నాథ్​ కాంబినేషన్​లో రూపొందిన హిట్​ చిత్రం 'ఇస్మార్ట్​ శంకర్​'. ఈ సినిమా హిందీ వెర్షన్​ ఇప్పుడు బాలీవుడ్​ ప్రేక్షకులను అలరిస్తోంది. యూట్యూబ్​లో ఈ సినిమా హిందీ డబ్బింగ్​కు ఏకంగా 200 మిలియన్ల వ్యూస్​ లభించాయి.

rapo ismart sankar
రామ్​ ఇస్మార్ట్​ శంకర్​
author img

By

Published : May 30, 2021, 7:43 PM IST

హీరో రామ్.. మాస్​ లుక్​లో కనిపించి, అలరించిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో దర్శకుడు పూరీ జగన్నాథ్​ సూపర్​హిట్​ అందుకున్నారు. దాదాపు రూ.80 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిందీ చిత్రం. ఈ చిత్ర హిందీ డబ్బింగ్​ వెర్షన్​కు యూట్యూబ్​లో విశేషాదరణ లభిస్తోంది. ఆదిత్య మూవీస్​ యూట్యూబ్​ ఛానల్​లో ఇప్పటివరకు ఈ సినిమాకు 200 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి.

'ఇస్మార్ట్​ శంకర్​' సూపర్​హిట్​ కావడం వల్ల ఈ చిత్రానికి కొనసాగింపుగా సీక్వెల్​ను రూపొందిస్తారని గతంలో ఊహాగానాలు వినిపించాయి. కొత్త సినిమా కోసం పూరీ జగన్నాథ్​ ఇప్పటికే స్టోరీ సిద్ధం చేసినట్లు టాక్​. 'ఇస్మార్ట్​..'లో నటించిన హీరోయిన్లు నభా నటేష్​, నిధి అగర్వాల్​.. సీక్వెల్​లోనూ కనిపిస్తారని తెలుస్తోంది.

హీరో రామ్​ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కృతిశెట్టి కథానాయిక. మరోవైపు దర్శకుడు పూరీజగన్నాథ్​.. విజయ్​ దేవరకొండతో 'లైగర్'​ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్​ సరసన బాలీవుడ్​ బ్యూటీ అనన్యా పాండే నటిస్తోంది. శరవేగంగా షూటింగ్​ పూర్తి చేసుకుంటోన్న 'లైగర్'​ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: 'ఇస్మార్ట్ శంకర్'​గా రణ్​వీర్ సింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.