ETV Bharat / sitara

'పైరసీలో చూశాం క్షమించండి.. టికెట్ డబ్బులు పంపిస్తాం' - పైరసీలో ది గ్రేట్ ఇండియన్ కిచెన్

సూరజ్ వెంజరముడు, నిమిష సజయన్​ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్'. జనవరి 15న ఓటీటీ సంస్థ నీ స్ట్రీమ్ ప్లాట్​ఫామ్​లో విడుదలైంది. అయితే చాలా మంది ఈ చిత్రాన్ని పైరసీ కాపీ ద్వారా వీక్షించారట. కానీ సినిమా చాలా బాగుందని.. నిర్మాతకు టికెట్ డబ్బులు పంపిస్తామని తెలిపారట.

The Great Indian Kitchen
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
author img

By

Published : Jan 26, 2021, 1:16 PM IST

సూరజ్ వెంజరముడు, నిమిష సజయన్ జోడీగా తెరకెక్కిన మలయాళ చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్'. జనవరి 15న ఓటీటీ ద్వారా విడుదలైన ఈ సినిమా విమర్శల ప్రశంసలూ అందుకుంటోంది. అయితే కొంతమంది మాత్రం ఓటీటీ సంస్థ నీ స్ట్రీమ్​లో చూడకుంగా పైరసీని ఆశ్రయించారు.

ప్రముఖ సమాచార యాప్ టెలిగ్రామ్​ ద్వారా ఈ సినిమాను వీక్షించడానికి చాలామంది ఆసక్తి చూపించారు. దీంతో చిత్రబృందం నిరాశలో పడిపోయింది. కానీ ఈ సినిమాను పైరసీ ద్వారా చూసిన చాలామంది.. మూవీ చాలా బాగుందని.. ఓ సామాన్య గృహిణి కష్టాలు కళ్లకు కట్టినట్లు చూపించారని ప్రశంసిస్తూ టికెట్ డబ్బులు రూ.140ని నిర్మాతకు పంపిస్తామంటూ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని దర్శకుడు జియో బేబీ తన ఫేస్​బుక్ ద్వారా వెల్లడించారు.

కథేంటంటే?

ఓ యువతి (నిమిష) పెద్దలు కుదిర్చిన సంబంధం ద్వారా ఓ యువకుడి(సూరజ్)ని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత అత్తారింటిలో బాధ్యతలు భుజానికెత్తుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఆ కుటుంబంలో ఎలా సర్దుకుపోయిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

'తొండిముత్తలుమ్ ద్రిక్సక్షియుమ్' జోడీ సూరజ్, నిమిష మరోసారి ఈ సినిమాతో అలరించారు. వీరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిందని, సినిమా చాలా స్వచ్ఛంగా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.