ETV Bharat / sitara

మనల్ని మనం మరిచిపోయేలా చేసే సినిమా ఇది! - olivia colman the father

ఆంటోనీ హాఫ్కిన్స్‌ కళ్లు చెదిరే నటనతో, ఊపిరి సలపని స్క్రీన్‌ప్లేతో ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలిచింది 'ది ఫాదర్‌'. విమర్శకుల ప్రశంసలతో పాటు.. ఆస్కార్‌ పోరులో బలమైన సినిమాగా నిలిచింది. హృదయాన్ని కదిలించే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని.. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధాన పోటీదారుగా ఉంది.

the father movie nominated to oscars 2020
మనల్ని మనం మరిచిపోయేలా చేసే సినిమా ఇది!
author img

By

Published : Apr 15, 2021, 2:36 PM IST

చిత్రం: ది ఫాదర్;

భాష: ఇంగ్లీష్‌;

దర్శకుడు: ఫ్లోరీయాన్‌ జెల్లర్‌;

తారాగణం : ఆంటోనీ హాఫ్కిన్స్‌ , ఒలోవియా కాల్మన్‌ తదితరులు;

నిడివి:97 నిమిషాలు;

ఆస్కార్‌ నామినేషన్స్‌: 6

2012లో దర్శకుడు ఫ్లోరియన్‌ జెల్లర్‌ రాసుకున్న ఓ ఫ్రెంచ్‌ నాటకాన్నే గతేడాది సినిమాగా మలిచాడు. నాటకంగా ఎంత పేరు తెచ్చిందో.. సినిమాగానూ అంతకు మించి పేరు సంపాదించింది. తండ్రిగా జీవించిన ఆంటోనీ హాఫ్కిన్స్, కూతురిగా చేసిన ఒలివియా కాల్మిన్‌ పోటాపోటీగా నటించి సినిమాను నిలబెట్టారు.

కథేంటంటే?

తండ్రి మతిమరుపు.. కూతురి భవిష్యత్తుల మధ్య మానసిక సంఘర్షణే ఈ కథ. ఆంటోనీ వయసైపోయిన వృద్ధుడు. మతిమరుపు వ్యాధితో బాధపడుతుంటాడు. అతని కూతురు ఆన్‌. తండ్రి బాగోగులను ఆమె చూసుకుంటుంటుంది. కొంత కాలానికి తనకంటూ వేరే జీవితం ఉందని, లండన్‌ను వదిలి పారిస్‌కు వెళ్లాలని అనుకుంటుంది. అక్కడ తన కొత్త బాయ్‌ ఫ్రెండ్‌తో జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. ఈ విషయం తండ్రికి చెబితే అయోమయంలో పడిపోతాడు. గతం సరిగా గుర్తుండకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడిపోతుంటాడు. ఫ్లాట్‌లోకి కొత్త మనుషులు వచ్చినట్లు, చేతి గడియారం ఎవరో దొంగిలించినట్లు భావిస్తుంటాడు. ఒక్కోసారి సొంత కూతురిని గుర్తు పట్టలేక ఆవేదనకు గురవుతాడు. ఈ సమయంలో ఆయనకు సహాయంగా ఒక కేర్‌ టేకర్‌ను నియమించి పారిస్‌కి వెళ్లాలనుకుంటుంది అన్‌. మరి చివరికి ఆన్‌ ఏం చేసింది? తండ్రిని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్లిందా..? లేదా? అనేది మిగతా కథ.

మాయ చేసే స్క్రీన్‌ప్లే..

'ది ఫాదర్‌'లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది స్క్రీన్‌ప్లే గురించే. ప్రేక్షకులు ఆంటోనీ వ్యథను చూస్తున్నట్లు కాకుండా, మనమే ఆంటోనీ అన్నట్లుగా, మతిమరుపు మనకే ఉందేమో అనెంతలా సన్నివేశాలు ఉంటాయి. ఒక్కోసారి.. ఎవరు ఏ పాత్రధారులో కూడా అర్థం కాదు. పాల్‌ ఎవరు? లూసీ ఎవరు? మాటిమాటికీ ఆ ఫ్లాట్‌ ఎందుకు మారుతుంది? ఇంతకీ ఫ్లాట్‌ అంటోనిదా కాదా? ఇలా అనేక రకాల గందరగోళం ఆంటోనిలానే మనలోనూ ఏర్పడేలా స్క్రీన్‌ప్లే సాగుతుంది. మనమే ఆంటోని అయిపోయింతలా ఆ పాత్ర మనల్ని ప్రభావితం చేస్తుంది.

16 నిమిషాలకే..

మతిమరుపు తండ్రిగా రెండు గంటల పాటు తన నటనతో కట్టి పడేసిన ఆంటోనీ హాఫ్కిన్స్‌ను తొలి ఆస్కార్‌ 'ది సైలెన్స్‌ ఆఫ్‌ది లాంప్స్‌'కు వరించింది. 16 నిమిషాలే నిడివి ఉన్న పాత్రలో అందర్నీ మెప్పించిన హాఫ్కిన్స్‌ ఆ అవార్డు సంపాదించారు. 'ది ఫాదర్‌'లో తండ్రికీ-తన భవితవ్యానికీ మధ్య నలిగిపోయే కూతురు పాత్రలో ఓలివియా కట్టిపడేస్తుంది. ఆమె 'ది ఫేవరేట్‌' సినిమాకు ఉత్తమ నటి పురస్కారాన్ని 2019లోనే గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ ఉత్తమ సహాయ నటి విభాగంలో పోటీలో ఉంది. వీటితో పాటు ఫిల్మ్‌ ఎడిటింగ్, అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్‌ డిజైనింగ్, ఉత్తమ చిత్రం విభాగాల్లో పోటీలో ఉంది 'ది ఫాదర్‌'.

ఇదీ చూడండి: గ్లామర్​ డోస్​ పెంచేసిన బుల్లితెర యాంకర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.