"కరోనా తర్వాత సినీ పరిశ్రమ పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతున్నా(peddanna rajinikanth). ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థియేటర్‌కు రావడం మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలో మరో వాణిజ్య ప్రధానమైన పెద్ద సినిమా అయితే మరింత మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం సులభం అవుతుంది. అందుకే మేం కలిసి 'పెద్దన్న' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు. ఆయన ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, నారాయణ్‌దాస్ నారంగ్‌తో కలిసి రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'పెద్దన్న' సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం దీపావళి(annaatthe movie release date) సందర్భంగా ఈ నెల 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నారాయణ్‌దాస్ నారంగ్ మాట్లాడుతూ "రజనీకాంత్ అనారోగ్యం(rajinikanth health condition) నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మాపై నమ్మకంతో 'పెద్దన్న'(rajinikanth new movie annaatthe) చిత్రం హక్కుల్ని ఇచ్చిన సన్ టీవీకి, రజనీకాంత్‌కు కృతజ్ఞతలు. చిత్రం తప్పకుండా విజయవంతం అవుతుంది" అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ "తమిళంలో తెరకెక్కిన 'అన్నాత్తే'(rajinikanth latest movie) సినిమాకు అనువాదంగా వస్తోంది 'పెద్దన్న'. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నాం. మేం కలిసి ఈ సినిమాను ఎందుకు విడుదల చేస్తున్నామా అనే అనుమానాలు రావొచ్చు. ఇకపై కూడా మేం కలిసి సినిమాలు నిర్మిస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటి పెద్ద సినిమాలు అవసరం(peddanna rajinikanth). మంచి కథ, మంచి పాటలు, మంచి వాణిజ్యాంశాలున్న చిత్రమిది. ఒకప్పటి రజనీకాంత్ కనిపిస్తున్నారు. భావోద్వేగాలు, అన్నాచెల్లెళ్ల బంధం, క్లాస్ మాస్ కలిసి చూడగలిగే అంశాలున్న సినిమా. అందుకే మేం కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అన్నారు.
ప్రదర్శన రంగంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఇప్పుడు మధ్యస్థమైనవి పాన్ ఇండియా స్థాయి సినిమాలు అవుతున్నాయన్నారు సురేష్‌బాబు. "ప్రేక్షకులు భిన్న రకాల సినిమాలు చూడాలనుకుంటున్నారు. వాళ్లకి రకరకాల కథలు అందించేందుకు ఎగ్జిబిటర్లు కూడా కలిసిపోయి సినిమాల్ని పంచుకుంటున్నారు. ఇదివరకు కొన్ని సినిమాల్నే ఉత్తరాదిలో విడుదల చేసేవాళ్లం. ఇప్పుడు మన సినిమాలు అక్కడ విరివిగా విడుదలవుతున్నాయి. అది ప్రేక్షకులకు మంచిది, పరిశ్రమకీ మంచిది" అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: కోలుకున్న రజనీకాంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్