యువ కథానాయకుడు నాగచైతన్య తన కొత్త చిత్రం 'థ్యాంక్యూ' కోసం రంగంలోకి దిగనున్నారు. డిసెంబరు నుంచే చిత్రీకరణకు హాజరు కానున్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో, దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రమిది. చైతూ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.
ఓ కథానాయికగా ఇప్పటికే ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాతో ఆకట్టుకుందీ భామ. మరో ఇద్దరు నాయికల ఎంపిక కోసం చిత్రబృందం కసరత్తులు ముమ్మరం చేసింది. నాగచైతన్య ఇన్నాళ్లూ ‘లవ్‌స్టోరీ’ పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. ఆ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.