ఈ మధ్య కాలంలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ కరోనా ప్రభావం, థియేటర్ల మూసివేత కారణంగా వాయిదా పడుతున్నాయి. వాటి కొత్త రిలీజ్ తేదీలపైనా సందిగ్ధత ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది అనసూయ 'థ్యాంక్ యు బ్రదర్'. మే 7న ఈ చిత్రం ఆహాలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. థ్రిల్లింగ్‌కు గురిచేస్తోన్న ఈ ప్రచారం చిత్రం మూవీపై అంచనాల్ని పెంచుతోంది.
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఓ గర్భిణి, యువకుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందులో నుంచి ఎలా బయటపడ్డారు? అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. రమేశ్ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">