ETV Bharat / sitara

అందుకే 'తెలుసా మనసా' ట్యూన్‌ వద్దన్నారట! - తెలుసా మనసా క్రిమినల్

కొన్నిసార్లు కొన్ని పాటలు ఓ సినిమా కోసం స్వరపరిస్తే మరో చిత్రంలో వినిపిస్తుంటాయి. అదే కోవకు చెందుతుంది నాగార్జున 'క్రిమినల్' చిత్రంలోని 'తెలుసా.. మనసా' సాంగ్. అసలు ఈ పాట ఏ మూవీ కోసం స్వరపరిచారో తెలుసా.!

అందుకే 'తెలుసా మనసా' ట్యూన్‌ వద్దన్నారట!

author img

By

Published : Sep 6, 2020, 5:24 AM IST

'తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో..' ఈ రొమాంటిక్‌ గీతం సంగీత ప్రపంచాన్ని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు ఓ సినిమా కోసం చేసిన ట్యూన్‌ మరో చిత్రంలో వినియోగిస్తారనే విషయం తెలిసిందే. ఆ కోవలోకే వస్తుంది 'తెలుసా మనసా'. నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన 'క్రిమినల్‌' సినిమాలోని ఈ పాట ముందుగా జగపతిబాబు సినిమా కోసం స్వర పరిచారు ఎం.ఎం. కీరవాణి.

అదే సినిమా అంటే? 'అల్లరి ప్రేమికుడు'. రాఘవేంద్రరావు- కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. రంభ, సౌందర్య, కాంచన్, రమ్యకృష్ణ నాయికలు. ఓ సన్నివేశంలో సౌందర్య.. 'జగపతిబాబుని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి ముహూర్తం చూడు' అని బామ్మ నిర్మలకు చెప్తుంది. ఆ ఆనందాన్ని టేబుల్‌పై ఉన్న చిలక బొమ్మతో పంచుకుంటుంది. చిలకలో జగపతి బాబుని ఊహించుకుని 'ఐ లవ్‌ యు' అని చెప్పగా.. చిలక కూడా 'ఐ లవ్‌ యు' అని సమాధానం ఇస్తుంది. ఇక్కడ ఓ పాట కావాలని రాఘవేంద్రరావు.. కీరవాణికి సూచించారు. దాని కోసం చాలా బాణీలు సిద్ధం చేసి వినిపించారు కీరవాణి. వాటిల్లో ఒకటే 'తెలుసా మనసా'.

'కలికి చిలక ముద్దు తాంబూలం ఇమ్మందని' అంటూ సాగే సాహిత్యంతో కూడిన ట్యూన్‌ వినిపించగా.. సన్నివేశానికి సరిపోదనిపించి వద్దన్నారు రాఘవేంద్రరావు. దాంతో మిగిలిన వాటిల్లోని 'చిలిపి చిలక ఐ లవ్‌ యు అన్న వేళలో' అనే పాటని ఎంపిక చేసుకున్నారు.

కొంతకాలం తర్వాత బాలీవుడ్‌ దర్శకుడు మహేష్‌ భట్‌.. నాగ్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన 'క్రిమినల్‌'లో ఈ బాణీని వాడుకున్నారు. అలాంటి ఈ గీతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.