*నాగశార్య, రీతూవర్మ జంటగా నటించిన కుటుంబ కథాచిత్రం 'వరుడు కావలెను'(varudu kaavalenu). అక్టోబరులో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మంగళవారం చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. రిచ్ విజువల్స్‌తో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసిన ఫొటోలను మొదటగా పోస్ట్ చేశారు. లాక్డౌన్లో తనకు జరిగిన చాలా పాజిటివ్ విషయాల్ని షేర్ చేస్తానని చెప్పారు. ఈ స్టోరీ రాసేటప్పటికీ ఆమెకు 1.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
*బట్టతల వల్ల వచ్చే ఇబ్బందుల నేపథ్య కథతో తీసిన చిత్రం 'నూటొక్క జిల్లాల అందగాడు'(nootokka jillala andagadu). శ్రీనివాస్ అవసరాల, రుహానీ శర్మ హీరోహీరోయిన్లు. ఇప్పుడు ఈ సినిమాలోని 'నా గర్ల్‌ఫ్రెండ్'(naa girl friend song) అంటూ సాగే గీతం రిలీజైంది. సెప్టెంబరు 3న థియేటర్లలో సినిమా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(deepika padukone).. తన బ్యానర్లో మరో సినిమా నిర్మించేందుకు సిద్ధమైంది. 'క్రాస్ కల్చర్' రొమాంటిక్ కామెడీ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈమె ప్రధాన పాత్రలో నటించిన పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.
*విజయ్ సేతుపతి 'తుగ్లక్ దర్బార్'(tughlaq durbar) ట్రైలర్ రిలీజైంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కథతో సినిమా తీసినట్లు తెలుస్తోంది. రాశీఖన్నా, మంజిమా మోహన్ హీరోయిన్లు. సత్యరాజ్, పార్థిబన్ కీలకపాత్రలు పోషించారు. త్వరలో థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: