ETV Bharat / sitara

రాజమౌళి సార్.. ఇదెలా సాధ్యం: నాని - ఆర్ఆర్ఆర్ మూవీ

ప్రేక్షకుల్ని అలరిస్తున్న 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్​పై హీరో నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. 45 సెకన్లలో ఇదెలా సాధ్యమైందని రాసుకొచ్చారు. మహేశ్​, అల్లు అర్జున్​ కూడా ఈ గ్లింప్స్​పై ట్వీట్లు చేశారు.

.
.
author img

By

Published : Nov 1, 2021, 7:57 PM IST

సినీప్రియుల ఎదురు చూపులకు తెరదించుతూ సోమవారం ఉదయం 'ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌' (RRR Glimpse) విడుదలైంది. తారక్‌-రామ్‌చరణ్‌తోపాటు సినిమాలో కీలకపాత్రలు పోషించిన వారందర్నీ ఈ 45 సెకన్ల వీడియోలో అద్భుతంగా చూపించారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌'పై నేచురల్‌స్టార్‌ నాని (nani), ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), సూపర్​స్టార్ మహేశ్​బాబు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ట్విటర్‌ వేదికగా తమ ఇష్టాయిష్టాలను తెలిపారు. "రాజమౌళి సార్‌.. 45 సెకన్ల వీడియోను ఇంత వైవిధ్యంగా ఎలా చూపించగలిగారు?" అని నాని కామెంట్‌ చేశారు.

మరోవైపు బన్నీ స్పందిస్తూ.. "మైండ్‌ బ్లోయింగ్‌. భారతీయ చిత్రపరిశ్రమకు రాజమౌళి ఓ గర్వకారణం. నా బ్రదర్‌ చరణ్‌.. నా బావ తారక్.. పవర్‌ప్యాక్డ్‌ ప్రదర్శనతో అదరగొట్టేశారు. అజయ్‌, ఆలియా, శ్రియతోపాటు చిత్రబృందం మొత్తానికి నా హృదయ పూర్వక అభినందనలు" అని బన్నీ తెలిపారు. వాళ్లిద్దరి కామెంట్స్‌పై స్పందించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ ధన్యవాదాలు తెలిపింది. 'పుష్ప' సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

ప్రముఖ నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా సిద్ధమవుతోందని అంచనా. ఇందులో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, తారక్‌.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ ఈసినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్నారు. తారక్‌కు జంటగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి రానుంది 'ఆర్ఆర్ఆర్'.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.