అభిరుచి ఉన్న నిర్మాత ముందుకు వస్తే సినిమా చేయడానికి సిద్ధమని ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డి అన్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తన దగ్గర కథలు ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగత పనుల మీద తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవితో తనకు ఉన్న అనుంబంధాన్ని వివరించారు. తాను దర్శకత్వం చేసిన 92 సినిమాల్లో 27 చిరంజీవితో చేసినవేనని గుర్తు చేసుకున్నారు. ట్రెండ్ ఏదైనా సినిమాకు కథే మూలమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'రైతులకూ సరళమైన వ్యాపారం, సులభతర జీవనం'