ETV Bharat / sitara

డిసెం'బరి'.. ముగింపులో మెరుపులే! - స్కైలాబ్ మూవీ

ఎప్పుడూ లేని రీతిలో డిసెం'బరి' రసవత్తరంగా మారింది. కొత్త సినిమాల విడుదలలతో కళకళలాడనుంది. సంక్రాంతికి దీటైన వ్యాపారం ఈ నెలలో జరగనుంది. ఈ సందర్భంగా డిసెంబరులో రిలీజ్​ అవుతున్న సినిమాలేంటి? వాటి సంగతేంటి చూసేద్దామా?

telugu december movies release
డిసెంబరు తెలుగు మూవీస్
author img

By

Published : Dec 2, 2021, 6:51 AM IST

డిసెంబర్‌లో స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం అరుదు. తెలుగు నాట సంక్రాంతి హడావిడి ముందే మొదలైపోతుంది కాబట్టి.. డిసెంబర్‌ మొత్తం పెద్ద పండగకు వచ్చే సినిమాల హడావిడే ఎక్కువ. వాటికి సంబంధించిన ప్రచారం, వేడుకలతో చిత్రసీమ బిజీ బిజీగా గడుపుతుంటుంది. మహా అంటే క్రిస్మస్‌, జనవరి 1ని లక్ష్యంగా చేసుకుని ఒకట్రెండు సినిమాలు వస్తుంటాయంతే. సంక్రాంతికే అసలు సిసలు సినీ సందడి. ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పండగ ముందే వచ్చేసిందా? అన్నట్టుగా అగ్ర తారల సినిమాలు బాక్సాఫీసు ముందుకు వరుస కడుతున్నాయి. గల్లా పెట్టెలు.. కొత్త రికార్డులు సంక్రాంతి కోసం వామ్‌అప్‌ చేసుకోవాలేమో అన్నట్టుగా... 'తగ్గేదే లే' అంటూ వేసవి వరకు సినిమాలు పక్కా ప్రణాళికలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

కరోనా రెండో దశ తర్వాత

జులై నెలాఖరుకే తెలుగులో సినిమాలు రిలీజ్​లు మొదలయ్యాయి. తెలుగు ప్రేక్షకుడు అందరికంటే ధైర్యంగా థియేటర్‌కు వచ్చి టికెట్‌ కొన్నాడు. ఆ భరోసా.. ఆ ఉత్సాహం చిత్రసీమపై స్పష్టమైన ప్రభావమే చూపించింది. సినిమాలు ఒకదాని వెంట మరొకటి వచ్చాయి. అయితే నమోదైన విజయాలు కొన్నే. కుటుంబ ప్రేక్షకులతో పాటు.. మాస్‌ ప్రేక్షకుడూ పూర్తిస్థాయిలో థియేటర్‌కు రావడం లేదనే విషయాన్ని వసూళ్లు రుజువు చేస్తూ వచ్చాయి.

నవంబర్‌లో అయితే పదుల సంఖ్యలో విడుదలైనా ఒక్క విజయమూ నమోదు కాలేదు. ఇప్పుడు అందరి చూపూ ముగింపుపైనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకులు మునుపటిలా పోటెత్తాలంటే అగ్రతారల చిత్రాలు విడుదల మాత్రమే మార్గమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు తగ్గట్టే డిసెంబర్‌ మాసంలో బాలకృష్ణ, అల్లు అర్జున్‌, నాని తదితర తారలు తమ సినిమాలతో సందడి చేస్తున్నారు.

balayya akhanda movie
బాలయ్య అఖండ మూవీ

'అఖండ'తో ఆరంభం

ఈ ఏడాది తెలుగు చిత్రాలకు కీలకమైన ఈ నెలను బాలకృష్ణ 'అఖండ'తో ఆరంభిస్తున్నారు. మాస్‌ ప్రేక్షకుల్ని మరింత ఉత్సాహంగా థియేటర్‌కు రప్పించే సత్తా ఉన్న కలయిక బాలకృష్ణ - బోయపాటి శ్రీనుది. విజయవంతమైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత ఆ కలయికలో రూపొందిన ‘అఖండ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు, మాస్‌ ప్రేక్షకుల్లోనూ అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం గురువారమే విడుదలవుతోంది. ప్రారంభ వసూళ్లు మరో స్థాయిలో ఉండనున్నాయనడానికి ముందుస్తుగా అమ్ముడవుతున్న టికెట్లే ఉదాహరణ. విదేశాల్లోనూ ఈ సినిమా బాక్సాఫీసును పెద్దఎత్తున ప్రభావితం చేస్తోంది. బాలయ్య మళ్లీ థియేటర్లకు మునుపటి కళ తీసుకురావడం ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ నెల 3న మరో స్టార్‌ కథానాయకుడు మోహన్‌లాల్‌ నటించిన 'మరక్కార్‌' విడుదలవుతోంది. ఇప్పటికే జాతీయ అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. 4న నిత్యమేనన్‌, సత్యదేవ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన 'స్కైలాబ్‌' విడుదలవుతోంది. వీటి ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. విజయంపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.

skylab movie
స్కైలాబ్ మూవీ

పుష్ప.. రాయ్‌

తెలుగు సినిమా అంటే పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకొస్తాయి. ఇటీవల బహుభాషల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న అగ్ర తారల సినిమాలే ఎక్కువ. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప', నాని 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలోనే విడుదలవుతున్నాయి. 'పుష్ప' ఈ నెల 17న, 'శ్యామ్‌ సింగరాయ్‌' క్రిస్‌మస్‌ను పురస్కరించుకుని డిసెంబర్‌ 24న వస్తోంది.

allu arjun pushpa movie
అల్లు అర్జున్ పుష్ప

'పుష్ప' అల్లు అర్జున్‌కు తొలి పాన్‌ ఇండియా సినిమా. శేషాచలం అడవుల నేపథ్యంలో రూపొందుతోంది. 'రంగస్థలం' తర్వాత సుకుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రం కావడం, అల్లు అర్జున్‌తో ఆయనకు మూడో సినిమా కావడం వల్ల దీనిపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఐటమ్‌సాంగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరిస్తున్నారు.

‘శ్యామ్‌ సింగరాయ్‌’ నాని కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కింది. కోల్‌కతా నేపథ్యంలో, పీరియాడిక్‌ డ్రామాగా రూపొందింది. సాయిపల్లవి, కృతిశెట్టి తదితరులు ఆకర్షణగా నిలుస్తున్నారు. వరుసగా రెండు సినిమాల తర్వాత... థియేటర్లలో విడుదలవుతున్న నాని సినిమా ఇది. డిసెంబర్‌ 24నే కపిల్‌దేవ్‌ బయోపిక్‌గా తెరకెక్కిన '83' కూడా విడుదలవుతోంది. తెలుగులో అనువాదంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

nani shyam singhroy movie
నాని శ్యామ్ సింగరాయ్ మూవీ

వీళ్లూ ఉన్నారు...

అగ్ర తారల సినిమాలే కాదు, పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలూ ఈ నెలలోనే సందడికి ముస్తాబయ్యాయి. డిసెంబర్‌ 10న నాగశౌర్య 'లక్ష్య', అదే రోజునే కీర్తిసురేశ్ ‘గుడ్‌లక్‌ సఖి’, శ్రియ, నిత్యమేనన్‌, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్‌ నటించిన ‘గమనం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇది చదవండి: సంక్రాంతి కంటే ముందే పండగ.. డిసెంబరులో 'సినిమా'ల ధమాకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.