ETV Bharat / sitara

అమితాబ్ సినిమా విడుదలపై తెలంగాణ కోర్టు స్టే - అమితాబ్​ ఝండ్​ సినిమా

అమితాబ్​ కొత్త​ సినిమా విడుదలపై తెలంగాణ కూకట్​పల్లి కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు ప్రేక్షకుల ముందుకు తీసుకురాకుడదని నోటీసులు పంపింది.

Amitabh
అమితాబ్
author img

By

Published : Sep 21, 2020, 3:40 PM IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్​కు కూకట్​పల్లి సెషన్స్ కోర్టు షాక్​ ఇచ్చింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఝండ్​' సినిమాపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు విడుదల చేయకూడదని​ నిర్మాతలకు ఆదేశించింది.

ప్రముఖ ఫుట్​బాలర్​ అఖిలేశ్ పాల్ జీవితాధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 'సైరత్' ఫేమ్ నాగరాజ్ మంజులే దర్శకత్వం వహిస్తున్నారు. అఖిలేశ్ బయోపిక్​ తీసే హక్కులు తన దగ్గర ఉన్నాయని హైదరాబాద్​కు చెందిన దర్శకుడు నంది చిన్నికుమార్ కోర్టును ఆశ్రయించారు. అఖిలేశ్ తనను మోసం చేశారని అన్నారు. విచారించిన కూకట్​పల్లి కోర్టు.. సినిమా విడుదలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని 'ఝండ్​' దర్శకుడు, నిర్మాతలకు నోటీసులు పంపింది.

ఇదీ చూడండి డ్రగ్స్​ కేసు: శ్రద్ధా​ కపూర్​, సారా​లకు సమన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.