తెలుగు సినీ ప్రేమికులకు శుభవార్త. థియేటర్లలో 100 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక జీవో జారీ చేసింది. తక్షణమే ఇది అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా లాక్డౌన్ తర్వాతర గతేడాది అక్టోబరులో థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. కానీ 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలనే నిబంధన విధించింది. భౌతిక దూరం, శానిటైజేషన్ లాంటి రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు పలు నిబంధనలు పాటిస్తూ, హాళ్లలోకి తక్కువ మందికి మాత్రమే అనుమతిస్తూ వచ్చాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
ఇది చదవండి: ఒకే థియేటర్లో మూడేళ్లు ఆడిన సినిమా!