ETV Bharat / sitara

'సినిమాలో ట్రాజెడీ ఉండదు.. కానీ కన్నీళ్లొస్తాయి' - తరుణ్​ ఇంటర్వ్యూ

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​లో తరుణ్​ హీరోగా కె. విజయ్​ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'నువ్వే కావాలి'. ఈ చిత్రం విడుదలై నేటి (అక్టోబర్ 13) తో 20 ఏళ్లు పూర్తి పూర్తయింది. ఈ సందర్భంగా హీరో తరుణ్​​ మూవీ గురించి ఆసక్తికర విషయాలు ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

tarun
తరుణ్​
author img

By

Published : Oct 13, 2020, 2:47 PM IST

తరుణ్​

హీరో తరుణ్‌, రిచా జంటగా కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'నువ్వే కావాలి'. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం నేటితో (అక్టోబరు 13) 20 వసంతాలు పూర్తి చేసుకుంది. తరుణ్‌-రిచాల నటన, విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌, త్రివిక్రమ్‌ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా హీరో తరుణ్​ చిత్రవిశేషాలను 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

"సినిమా ఇంత పెద్ద సక్సెస్​ అవుతుందని అనుకోలేదు. తొలి సినిమా సక్సెస్​ అవ్వడం అనేది అదృష్టం. విజయ్​ భాస్కర్​, రవికిశోర్​, రామోజీరావు, రిచా, కోటి సహా చిత్రబృందానికి ధన్యవాదాలు. అయితే ఈ సినిమా తొలి రోజు షూటింగ్​లో పాల్గొనేటప్పుడు 104 డిగ్రీల జ్వరం వచ్చింది. భయమో ఏమో తెలీదు కానీ అలా వచ్చింది. ఈ సినిమా సిల్వర్​ జుబ్లీ వేడుకలో "మూవీ చూస్తున్నపుడు ఎటువంటి విషాదం లేకుండా కళ్లలో నీళ్లు వచ్చాయి" అని చిరంజీవి అన్నారు. 'కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు' పాట చిత్రీకరణలో నాకు నిజంగా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఆ పాట విన్నప్పుడు ఓ చిన్న ఫీల్​ కలుగుతుంది. మొత్తంగా ఇది గుండెకు హత్తుకుపోయే సినిమా. 2021లో నా పుట్టినరోజున కొత్త సినిమా గురించి ప్రకటిస్తా. ప్రస్తుతం స్క్రిప్ట్​ వర్క్​ జరుగుతోంది. మరోసారి చిత్రబృందానికి నా ధన్యావాదాలు" అని తన మనసులోని మాటల్ని పంచుకున్నారు తరుణ్.

కరోనాను తేలికగా తీసుకోవద్దని ప్రజలకు సూచించారు తరుణ్​. వచ్చే ఏడాది నాటికి వైరస్ తగ్గుముఖం పట్టి అంతా బాగుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి 'నువ్వే కావాలి' కోసం నేను, రిచా అలా: తరుణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.