ETV Bharat / sitara

వకీల్‌సాబ్‌.. పవన్‌ను హత్తుకున్న తారక్‌!

'వకీల్​సాబ్'​ సినిమాను హీరో ఎన్టీఆర్​ వీక్షించి ప్రశంసించారని తెలిపారు నటుడు ప్రకాశ్​రాజ్​. అనంతరం పవన్​ను కలిసి హత్తుకున్నారని చెప్పారు.

pawan
పవన్​
author img

By

Published : Apr 14, 2021, 6:37 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇటీవల 'వకీల్‌సాబ్‌' చిత్రాన్ని వీక్షించినట్లు నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. ఆ సినిమా చూసిన అనంతరం పవన్‌ను తారక్ కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారని ఆయన అన్నారు.

పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'వకీల్‌సాబ్‌' ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు. సినిమాలో తాను పోషించిన నందాజీ పాత్ర, దానికి లభిస్తున్న ప్రశంసల గురించి ఆయన తెలియజేశారు.

"వకీల్‌సాబ్ వీక్షించిన తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నన్ను ఎంతో మెచ్చుకున్నారు. ఆయన లాంటి మంచి వ్యక్తి మన మధ్య ఉండడం మన అదృష్టం. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కర్నీ ఆయన ప్రోత్సహిస్తారు. అదే అన్నయ్యలో ఉండే గొప్పతనం. అన్నయ్య మాత్రమే కాకుండా మహేశ్‌బాబు కూడా చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. అలాగే పవన్‌ను కలిసి తారక్ ఆలింగనం చేసుకున్నారు. సరైన సమయంలో సమాజానికి ఉపయోగపడే కథతో వస్తే ఎంతో గుర్తింపు లభిస్తుందనడానికి ఇదో ఉదాహరణ" అని ఆయన తెలిపారు.

అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన 'పింక్‌'కు రీమేక్‌గా 'వకీల్‌సాబ్‌' రూపుదిద్దుకుంది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య ముఖ్య పాత్రలు పోషించారు. ప్రకాశ్‌రాజ్‌ మరో కీలకపాత్రలో మెప్పించారు. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దిల్‌ రాజు నిర్మాత.

ఇదీ చూడండి : 'మా అభిప్రాయాలు వేరైనా భావజాలం ఒక్కటే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.