ETV Bharat / sitara

'రన్​వే 34' ట్రైలర్​.. 'మిథు' టీజర్​.. 'పెన్నీ' సాంగ్​ రికార్డు - అజయ్​దేవగణ్​ రన్​ వే ట్రైలర్​

కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేశాయి. ఇందులో అజయ్​దేవగణ్​ 'రన్​వే 34' ట్రైలర్​, తాప్సీ 'శభాష్​ మిథు' టీజర్​, మహేశ్​బాబు 'పెన్నీ' సాంగ్​ రికార్డ్స్​ వివరాలు ఉన్నాయి.

tapsee
తాప్సీ
author img

By

Published : Mar 21, 2022, 4:01 PM IST

Updated : Mar 21, 2022, 4:16 PM IST

Ajaydevgan Runway 34 trailer: బాలీవుడ్‌లో మరో ఆసక్తికర చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'రన్‌వే 34'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలో కనిపించనుంది. అజయ్‌ దేవగణ్‌ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 2015లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. 'చేసిన తప్పు ఒప్పుకోవడంలోనే మనిషి క్యారెక్టర్​ తెలుస్తుంది', 'అసలేం జరిగింది. ఎలా జరిగింది అనే విషయాల మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. అదే నిజం' వంటి డైలాగ్​లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ ప్రచార చిత్రం ఆద్యంతం సినిమాపై ఉత్కంఠతను రేకేత్తిస్తోంది. విమానయాన రంగం చుట్టూ తిరిగే ఈ కథలో అజయ్‌, రకుల్‌ పైలట్లుగా, అమితాబ్‌ విచారణాధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 'యు మీ ఔర్‌ హమ్‌', 'శివాయ్‌' చిత్రాలకు అజయ్​ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. త్వరలోనే రానున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Tapsee Shabash Mithu teaser: భారత మహిళా క్రికెట్​ జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​ జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా 'శభాష్​ మిథు'. తాప్సీ ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. జనాలతో కిక్కిరిసిపోయిన స్టేడియంలోకి టీమ్​ను గెలిపించడానికి నేనున్నానంటూ భరోసానిస్తూ బ్యాట్​ను పైకెత్తుతూ అడుగుపెట్టింది తాప్సీ. శ్రీజిత్​ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వయాకామ్​ 18 స్టూడియోస్​ నిర్మించింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, గతంలోనూ తాప్సీ క్రీడానేపథ్యం ఉన్న చిత్రాలు చేసింది. 'సూర్మ', 'సాండ్​ కీ ఆంఖ్'​, 'రష్మీ రాకెట్'​ వంటి చిత్రాలు చేసింది.

Maheshbabu Peny song records: ప్రతి రూపాయి విలువను తెలియజేస్తూ సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన 'పెన్నీ' సాంగ్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేశ్​ యంగ్​ లుక్​, ఆయన కూతురు సితారతో కలిసి స్టెప్పులేయడం వల్ల ఈ పాట ఫ్యాన్స్​లో మరింత జోష్​ను నింపింది. సోషల్​మీడియాలోనూ రికార్డులు సృష్టిస్తోంది. యూట్యూబ్​లో ట్రెండింగ్​లో టాప్​ 1లో నిలిచింది. తెలుగు చిత్రసీమలో అతి తక్కువ సమయంలో 15 మిలియన్ల వ్యూస్​ను దక్కించుకున్న పాటగా నిలిచింది. 5లక్షలకు పైగా లైక్స్​ను దక్కించుకుంది. కాగా, ఈ గీతానికి అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించారు. నకాశ్‌ అజీజ్‌ అలపించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు సూపర్‌స్టార్‌ అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: ఈ వారమే 'ఆర్​ఆర్​ఆర్'​.. ఇంకా ఏ చిత్రాలు వస్తున్నాయంటే?

Last Updated : Mar 21, 2022, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.