ETV Bharat / sitara

యాక్షన్​ సీన్స్​తో తనీశ్​.. ప్రేమికుడిగా రక్షిత్ - puneeth rajkumar lucky man

మిమ్మల్ని పలకరించేందుకు సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'పలాస' ఫేం రక్షిత్​, తనీశ్(maroprasthanam tanish)​, కన్నడ స్టార్​ పునిత్​ రాజ్​కుమార్ కొత్త చిత్రాల​ వివరాలు ఉన్నాయి.

rakshit
రక్షిత్​
author img

By

Published : Sep 16, 2021, 5:18 PM IST

Updated : Sep 16, 2021, 5:30 PM IST

తనీశ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మరో ప్రస్థానం'(maroprasthanam tanish)​. 'జర్నీ ఆఫ్‌ యాన్‌ ఎమోషనల్‌ కిల్లర్‌'.. అనేది ఉప శీర్షిక. గురువారం(సెప్టెంబరు 16) ఈ చిత్ర ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. 'ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు. ఒకరు చనిపోయినవాడు. మరొకడు ఇంకా పుట్టనివాడు' అని విలన్‌ పాత్ర చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. 'అనాథనైన నాకు జీవితం యుద్ధంలానే అనిపించేది. ప్రపంచం యుద్దభూమిలా కనిపించేది' అంటూ తనీశ్‌ తన పాత్రను వివరించిన తీరు బాగుంది. 'అతి చిన్న కెమెరాతో సింగిల్‌ షాట్‌లో తెరకెక్కించిన తొలి సినిమా ఇదే' అని చిత్రబృందం తెలిపింది. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ కథకు జానీ దర్శకుడు. ముస్కాన్‌ సేథీ నాయిక. భానుశ్రీ మెహ్రా, కబీర్‌ దుహాన్‌ సింగ్‌ కీలక పాత్రధారులు. ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ మూవీకి సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'పలాస' హీరో రక్షిత్ నటిస్తున్న​ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ సహా ఓ ప్రత్యేక వీడియో విడుదలైంది. చిత్రానికి 'శశివదనే' అనే పేరును ఖరారు చేశారు. ఇందులో ప్రేమ గురించి రక్షిత్​ చెప్పిన డైలాగ్​ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సాయి మోహన్​ ఉబ్బెన దర్శకుడిగా, అహితేజ బెల్లంకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కన్నడ పవర్​స్టార్ పునిత్​ రాజ్​కుమార్​(puneeth rajkumar movies)​ నటిస్తున్న కొత్త చిత్రం 'లక్కీ మ్యాన్'. ఈ మూవీలో కొరియోగ్రాఫర్​​ ప్రభుదేవా.. పునిత్​తో కలిసి ఓ ప్రత్యేక గీతంలో చిందులేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వారిద్దరూ కలిసి స్టెప్పులేసిన ఫొటోలను పోస్ట్​ చేశారు పునిత్​. ప్రభుతో కలిసి డ్యాన్స్​ చేయడం గొప్ప అనుభూతినిచ్చిందని వ్యాఖ్య రాసుకొచ్చారు.

puneeth rajkumar, prabhudeva
పునిత్​ రాజ్​కుమార్​, ప్రభుదేవా
puneeth rajkumar, prabhudeva
పునిత్​ రాజ్​కుమార్​, ప్రభుదేవా

ఇదీ చూడండి: Prabhas Salaar: ఈ ఫైట్​ 'సలార్' సినిమాకే హైలెట్!

Last Updated : Sep 16, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.