Siddharth news: హీరో సిద్ధార్థ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌పై వివాదాస్పద ట్వీట్ విషయంలో తమిళనాడు పోలీసులు అతడికి సమన్లు జారీ చేశారు. ఈ విషయాన్ని చెన్నై పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
పంజాబ్‌లో ప్రధానిమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఈ విషయమై షట్లర్ సైనా, ప్రధానికే భద్రత లేకపోతే దేశవాసులకు పరిస్థితి ఏంటో అని ట్వీట్ చేశారు. దీనిపై రీట్వీట్ చేసిన హీరో సిద్ధార్థ్.. అసభ్యకర రీతిలో కామెంట్ పెట్టాడు. దీంతో అతడిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
అయితే సిద్ధార్థ్ నుంచి క్షమాపణలు కోరిన జాతీయ మహిళ కమిషన్.. భవిష్యత్తులో ఎవరు ఇలాంటి ట్వీట్లు చేయకుండా సిద్ధార్థ్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి లేఖ రాసింది. ఈ సందర్భంగానే చెన్నై పోలీసులు అతడికి సమన్లు జారీ చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: