ETV Bharat / sitara

పవన్ 'వకీల్ సాబ్'​ చిత్రంలో తమన్నా!

పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'వకీల్​ సాబ్' టైటిల్​తో రానున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఈ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

author img

By

Published : Jul 3, 2020, 10:45 AM IST

Tamanna to consider for Bakeelsaab
పవన్ కల్యాణ్

చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగా మారారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం బాలీవుడ్ 'పింక్' రీమేక్​ 'వకీల్​ సాబ్'​లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. మరి అది ఎలాంటి పాత్ర అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్​ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.