ETV Bharat / sitara

భారత్​లో అత్యంత ప్రమాదకరమైన సెలబ్రిటీలు వీరే - Most Dangerous Celebrity

భారత్​లో అత్యంత ప్రమాదకరమైన తొలి పది మంది సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది ఓ సైబర్​ భద్రత సంస్థ. వీరి పేర్లు ప్రమాదకరమైన వెబ్​సైట్లతో అనుసంధానించి ఉన్నాయని తెలిపింది.

Dangerous Celebrity
సెలబ్రిటీలు
author img

By

Published : Oct 6, 2020, 1:19 PM IST

ఈ ఏడాది భారత్​లో అత్యంత ప్రమాదకరమైన తొలి పది మంది సెలబ్రిటీల పేర్ల జాబితాను విడుదల చేసింది మెక్​కెఫీ సైబర్​భద్రత సంస్థ. అందులో బాలీవుడ్​కు చెందిన ప్రముఖులు టబు(2), తాప్సీ(3), నటుడు, నిర్మాత శర్మ(4), సోనాక్షి సిన్హా(5), గాయకుడు అర్మాన్​ మాలిక్​(6), సారా అలీఖాన్​(7), దివ్యాంక త్రిపాఠి(8), స్టార్​ హీరో షారుక్​ ఖాన్​(9), సింగర్​ అర్జిత్​ సింగ్​(10) స్థానాల్లో ఉన్నారు. వీరి పేర్లు ప్రమాదకరమైన వెబ్​సైట్లతో అనుసంధానించి ఉన్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డొ అగ్రస్థానంలో ఉన్నాడని వెల్లడించింది.

ఈ ప్రముఖుల గురించి ఆన్​లైన్​లో శోధించేవారిని లక్ష్యం చేసుకుని సైబర్​ నేరగాళ్లు మాల్‌వేర్‌, మాలిషియస్ సాఫ్ట్​వేర్​ ద్వారా​ వైరస్​​వ్యాప్తి చేస్తున్నారని తెలిపింది. తద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారని స్పష్టం చేసింది. వీరి గురించి శోధించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సైబర్​ సంస్థ సూచించింది.

"ప్రధాన స్పోర్ట్స్ ఈవెంట్స్, సినిమాలు, టీవీ షోలు, అభిమాన స్టార్ నటుల ఫొటోలు, వీడియోలు ఉచితంగా చూసేందుకు పైరసీ ప్లాట్‌ఫామ్స్​ను వినియోగిస్తున్నారు యూజర్లు. ఫ్రీ, పైరేటెడ్​ కంటెంట్​ మీధ ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా చూసుకుని సైబర్​ నేరగాళ్లు మాల్​వేర్​, మాలిషియస్​ సాఫ్ట్​వేర్​ను అందులో ఇన్​స్టాల్​ చేసి వైరస్​ వ్యాప్తి చేస్తున్నారు. తద్వారా సదరు యూజర్​ వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి" అని సంస్థ వెల్లడించింది.

ఇదీ చూడండి అభిమానులకు కాజల్​ శుభవార్త.. ఈ నెలలోనే పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.