ETV Bharat / sitara

తాప్సీ కష్టానికి కాజల్‌ ఫిదా - తాప్సీ జిమ్​ వీడియోస్​

'రష్మి రాకెట్'​ సినిమా కోసం విపరీతంగా కసరత్తులు చేస్తోన్న హీరోయిన్​ తాప్సీ.. తాజాగా తాను చెమటోడుస్తున్న ఓ వీడియోను పోస్ట్​ చేశారు. ఇది చూసిన పలువురు నటీమణులు ఆమె చేస్తున్న కసరత్తులకు ఫిదా అయ్యారు.

tapsee
తాప్సీ
author img

By

Published : Dec 16, 2020, 10:49 PM IST

పాత్ర కోసం ఎంతటి కష్టాన్నైనా భరించడానికి ముందుంటారు నటీనటులు. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా హీరోయిన్లు సైతం తాము పోషించే పాత్రలు డిమాండ్‌ చేస్తే జిమ్‌లో చెమటలు చిందించడానికి వెనుకాడడం లేదు. తాజాగా నటి తాప్సీ 'రష్మి రాకెట్‌' కోసం అదే విధంగా శ్రమించారు. ఆమె కష్టాన్ని చూసి కాజల్‌ ఫిదా అయ్యారు.

tapsee
తాప్సీ

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ ప్రస్తుతం రష్మీ రాకెట్ కోసం పనిచేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీగా ఆమె కనిపించనున్నారు. పూర్తిస్థాయి అథ్లెట్‌గా కనిపించేందుకు న్యూట్రీషియనిస్టు, ఫిజియోథెరఫిస్టు, ట్రాక్‌ ట్రైనర్‌, అథ్లెటిక్‌ కోచ్‌.. సహకారాన్ని తీసుకున్నారు. గ్రౌండ్‌లో చెమటోడుస్తున్న పలు ఫొటోలను ఇప్పటివరకూ షేర్‌ చేసిన ఆమె తాజాగా తన ట్రైనింగ్‌కు సంబంధించి ఓ స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

"ఇది భరించలేని నొప్పితో కూడుకున్న శిక్షణ. షూటింగ్‌ ప్రారంభమైన మూడోరోజే.. నా శరీరం దీనిని భరించలేదని అనిపించింది. పరుగెత్తలేకపోయాను. కేవలం నడవడం కోసం.. షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలనుకున్నా. ఈ సినిమా కోసం జిమ్‌లో ఎంతో శ్రమించా. తీవ్రంగా కష్టపడ్డా. నా జర్నీకి సంబంధించి ఇది కేవలం చిన్న గ్లిమ్స్‌ మాత్రమే" అని ఆమె అన్నారు.

తాప్సీ షేర్‌ చేసిన వీడియో చూసి పలువురు నటీమణులు ఫిదా అయ్యారు. 'అద్భుతం' అని కాజల్‌ ప్రశంసించగా.. విద్యాబాలన్‌, సోనాక్షి సిన్హా, పూజా రామచంద్రన్‌, భూమి ఫడ్నేకర్‌.. 'సూపర్‌' అంటూ కామెంట్లు పెట్టారు.

tapsee
తాప్సీ

ఇదీ చూడండి : 'హీరో భార్యలకు నచ్చక అవకాశాలు కోల్పోయా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.