విద్యుత్ బిల్లుల సెగ.. బాలీవుడ్‌ను తాకింది. లాక్‌డౌన్‌లో తమ బిల్లు ఊహించని రీతిలో పెరిగాయని నటులు తాప్సీ, హ్యుమా ఖురేషీ, దర్శకుడు బిజోయ్ నంబియార్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 3 నుంచి 4 వేల వరకూ వచ్చిన మొత్తం.. ఇప్పుడు ఏకంగా 30 నుంచి 50 వేల వరకూ వస్తోందని తెలిపారు.
గతంలో ఎన్నడూ చూడనంతా విద్యుత్ బిల్లులు తమకు వస్తున్నాయని ప్రముఖ నటి తాప్సీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఏప్రిల్-జూన్ వరకూ వచ్చిన విద్యుత్ బిల్లులను ట్వీట్ చేశారు. ఏప్రిల్, మే నెలలో రూ.3 నుంచి 4 వేల వరకూ విద్యుత్ బిల్లులు రాగా.. జూన్‌లో మాత్రం ఏకంగా రూ.36 వేలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఉపయోగించిన ఉపకరణాలు ఏమి లేనప్పటికి ఈ స్థాయిలో విద్యుత్ బిల్లులు రావటంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
-
3 months of lockdown and I wonder what appliance(s) I have newly used or bought in the apartment only last month to have such an insane rise in my electricity bill. @Adani_Elec_Mum what kind of POWER r u charging us for? pic.twitter.com/jZMMoxDMgj
— taapsee pannu (@taapsee) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">3 months of lockdown and I wonder what appliance(s) I have newly used or bought in the apartment only last month to have such an insane rise in my electricity bill. @Adani_Elec_Mum what kind of POWER r u charging us for? pic.twitter.com/jZMMoxDMgj
— taapsee pannu (@taapsee) June 28, 20203 months of lockdown and I wonder what appliance(s) I have newly used or bought in the apartment only last month to have such an insane rise in my electricity bill. @Adani_Elec_Mum what kind of POWER r u charging us for? pic.twitter.com/jZMMoxDMgj
— taapsee pannu (@taapsee) June 28, 2020
తాను వినియోగించని అపార్ట్‌మెంట్‌కూ రూ.8,600 బిల్లు వచ్చినట్లు బాలీవుడ్ నటుడు ఒకరు తెలియజేశారు. దీనిని చూస్తే, తన అపార్ట్మెంట్లో ఎవరైనా ఉంటున్నారమోనని అనుమానం కలుగుతుందని అన్నారు.
నటుడు పుల్కిత్ సామ్రాట్.. తనకు రూ.30 వేల బిల్ వచ్చిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇదే విషయమై స్పందించిన నటి రేణుకా సహానే.. మే నెలలో రూ.5,500 బిల్లు రాగా... జూన్‌లో వచ్చిన మొత్తం చూసి తాను షాక్ తిన్నట్లు వెల్లడించారు.
-
Dear @Adani_Elec_Mum I got a bill of Rs5510/= on the 9th of May while in June I got a bill of Rs 29,700 combining May & June where you've charged me Rs 18080 for the month of May. How did Rs.5510/= become Rs.18080/=? pic.twitter.com/64zlmNe8Qo
— Renuka Shahane (@renukash) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear @Adani_Elec_Mum I got a bill of Rs5510/= on the 9th of May while in June I got a bill of Rs 29,700 combining May & June where you've charged me Rs 18080 for the month of May. How did Rs.5510/= become Rs.18080/=? pic.twitter.com/64zlmNe8Qo
— Renuka Shahane (@renukash) June 28, 2020Dear @Adani_Elec_Mum I got a bill of Rs5510/= on the 9th of May while in June I got a bill of Rs 29,700 combining May & June where you've charged me Rs 18080 for the month of May. How did Rs.5510/= become Rs.18080/=? pic.twitter.com/64zlmNe8Qo
— Renuka Shahane (@renukash) June 28, 2020
నటి హ్యూమా ఖురేషీ.. గత నెలలో రూ.6000 వచ్చిన బిల్లు.. ఈ నెల రూ.50 వేలకు పెరిగిపోయిందని మండిపడ్డారు. ఇంతగా రేట్లు ఎందుకు పెరిగాయో అర్థం కావడం లేదని చెప్పారు. ఆదానీ ఎలక్ట్రిసిటీ బోర్డు వారే తనకు జ్ఞానోదయం చేయాలని తెలిపారు.
-
What are these new electricity rates ?? @Adani_Elec_Mum Last month I paid 6k .. and this month 50 k ????!!! What is this new price surge ?? Kindly enlighten us
— Huma S Qureshi (@humasqureshi) June 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">What are these new electricity rates ?? @Adani_Elec_Mum Last month I paid 6k .. and this month 50 k ????!!! What is this new price surge ?? Kindly enlighten us
— Huma S Qureshi (@humasqureshi) June 29, 2020What are these new electricity rates ?? @Adani_Elec_Mum Last month I paid 6k .. and this month 50 k ????!!! What is this new price surge ?? Kindly enlighten us
— Huma S Qureshi (@humasqureshi) June 29, 2020
దర్శకుడు బిజోయ్ నంబియార్.. జూన్ నెల కరెంట్ బిల్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నెల రోజుల్లోనే మూడు రెట్లు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెరుగుతాయని మరో డైరెక్టర్ డేవిడ్ ప్రశ్నించారు.
వీరి బాటలోనే నేహా ధూపియా, డినో మోరియా, మహ్మద్ జీషన్ అయూబ్ సహా ఇతర బాలీవుడ్ ప్రముఖులు తాము సైతం అధిక విద్యుత్ బిల్లులను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.
-
I was just going to tweet about it. Literally got a shock, pun intended. There was no surge in electricity, just the bill 🤔 @Adani_Elec_Mum https://t.co/zaJfQzFXla
— Dino Morea (@DinoMorea9) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I was just going to tweet about it. Literally got a shock, pun intended. There was no surge in electricity, just the bill 🤔 @Adani_Elec_Mum https://t.co/zaJfQzFXla
— Dino Morea (@DinoMorea9) June 28, 2020I was just going to tweet about it. Literally got a shock, pun intended. There was no surge in electricity, just the bill 🤔 @Adani_Elec_Mum https://t.co/zaJfQzFXla
— Dino Morea (@DinoMorea9) June 28, 2020
వేసవి కావడం వల్లే విద్యుత్ వినియోగం పెరిగిందని ఆదానీ ఎలక్ట్రికల్ ముంబయి లిమిటెడ్ ప్రతినిధి చెప్పారు. కాలానుగుణంగా విద్యుత్ వినియోగంలో వచ్చిన మార్పే ఇందుకు కారణమని తెలిపారు.