ETV Bharat / sitara

బాలీవుడ్​ బ్యూటీ తాప్సీకి కాబోయే భర్త అతడే - tapsee going to get marry soon

బాలీవుడ్​ నటి తాప్సీ తాజాగా తన ప్రేమ వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు మాథియాస్​ను త్వరలోనే వివాహమాడనున్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు ఇటీవలే తన ప్రేమను అంగీకరించారని స్పష్టం చేసింది.

Taapsee confirms her relationship with badminton player Mathias Boe
బాలీవుడ్​ బ్యూటీ తాప్సీకి కాబోయే భర్త అతడే!
author img

By

Published : May 12, 2020, 1:06 PM IST

కథానాయిక తాప్సీ, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మథియాస్ బో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కలిసి ఉన్న పలు ఫొటోలు బయటికి వచ్చాయి. అయితే తన ప్రియుడి విషయం కుటుంబ సభ్యుల దగ్గర దాచలేదని, వారికి తెలుసని తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

"నా వాళ్ల దగ్గర విషయాల్ని దాచడం నాకు ఇష్టం లేదు. నా జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడని చెప్పుకోవడం నాకెప్పుడూ గర్వంగానే ఉంటుంది. అదే విధంగా మంచి హెడ్‌లైన్‌ కోసం మీడియా ముందు ఆ వ్యక్తి గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. అలా చేస్తే నటిగా ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న విలువ తగ్గిపోతుంది. అందరూ నా నటన గురించి కాకుండా.. వ్యక్తిగత జీవితం గురించి రాస్తారు, మాట్లాడుతారు. నా జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడు. అతడి గురించి నా కుటుంబ సభ్యులకు తెలుసు. ఆ వ్యక్తి నాకే కాదు నా తల్లిదండ్రులకు, సోదరికి కూడా నచ్చాలి కదా. ఎందుకంటే తల్లిదండ్రుల అంగీకారం లేకపోతే.. ఏ ప్రేమ జీవితాంతం ఉండదు". - తాప్సీ, కథానాయిక

ఇదే ఇంటర్వ్యూలో తాప్సీ తల్లి నిర్మల్‌జీత్‌ కూడా మాట్లాడారు. "నాకు తాప్సీపై పూర్తి నమ్మకం ఉంది. ఆమె స్వతహాగా ఎవర్ని ఎంచుకున్నా.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఆమెకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది" అని తెలిపారు.

Taapsee confirms her relationship with badminton player Mathias Boe
తాప్సీ, మథియాస్​ బో

తాప్సీ ఇటీవల ‘థప్పడ్‌’ సినిమాతో హిట్‌ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా ‘జన గణ మన’ అనే తమిళ సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. తాప్సీ తెలుగు చిత్రంతో కెరీర్‌ ఆరంభించినప్పటికీ.. బాలీవుడ్‌లోనే బ్రేక్‌ అందుకుంది.

ఇదీ చూడండి.. 2020: లేడీ ఒరియెంటెడ్​​ సినిమాల ట్రెండ్​లో బాలీవుడ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.