మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా: నరసింహారెడ్డి' రెండో ట్రైలర్ నేడు (గురువారం) విడుదలైంది. అద్భుత యాక్షన్ సన్నివేశాలతో ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకొన్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మొదటి ట్రైలర్లో ప్రధాన పాత్రల పరిచయాలు, భావోద్వేగాలను ఎక్కువగా చూపించగా.. రెండో ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలపై దృష్టిపెట్టారు. 'చంపడమో, చావడమో ముఖ్యం కాదు.. గెలవడం ముఖ్యం' లాంటి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. చివరలో స్వాతంత్య్రంపై చిరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.
అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నయనతార, తమన్నా కథానాయికలు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
ఇదీ చదవండి: చిరు నవ్వుతో చెరగని ముద్రవేసిన వేణు మాధవ్