బాక్సాఫీస్ వద్ద సైరా నరసింహా రెడ్డి జోష్ కొనసాగుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ అందరినీ థియేటర్ల బాట పట్టిస్తున్నాడు ఉయ్యాలవాడ వీరుడు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రికార్డు స్థాయి వసూళ్లతో ట్రేడ్ పండితులకే ఆశ్చర్యం కలిగిస్తోంది సైరా నరసింహా రెడ్డి.
రెండు రోజుల్లోనే..
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా చిత్రం విడుదలైన తొలి రోజే రూ. 85 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండో రోజుతో రూ. వంద కోట్ల మార్కును అధిగమించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
జన నీరాజనం.. సైరా హవా
తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన సైరా నరసింహా రెడ్డి సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో సైరా భారీ ఆదరణ తెచ్చుకుంటోంది.
అమెరికాలో 2మిలియన్ డాలర్ల మార్కు..
ఇప్పటికే అమెరికాలో 2 మిలియన్(రూ. 14కోట్లకుపైగా) డాలర్లు వసూలు చేసింది సైరా. యూఎస్ మార్కెట్‌లో ప్రీమియర్ షోల ద్వారా 8,17,0000 డాలర్ల వసూళ్లు రాబట్టి అతి తక్కువ సమయంలోనే మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషించాడు. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: 'చాణక్య'లో మీరు చూసిన ప్రదేశాలు నిజం కావు..!