స్వర మాంత్రికుడు రెహమాన్ ఆస్కార్ అవార్డు సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో ఓ వేడుక నిర్వహించింది 'స్లమ్ డాగ్ మిలీనియర్' చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో రెహమాన్, ఖతీజాల భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఖతీజా బుర్ఖాలో రావడంతో కొంతమంది విమర్శనాస్త్రాలు సంధించారు. రెహమాన్ సంకుచిత స్వభావం కలవాడని, బుర్ఖా ధరించాలని కూతురిపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు.
- గతంలో ఈమె చీరతో ముఖాన్ని కప్పుకున్న సంఘటనను ప్రస్తావిస్తూ విమర్శకులు కామెంట్లు పెడుతున్నారు. పిల్లలకు రెహమాన్ స్వేచ్ఛనివ్వట్లేదని, దుస్తుల విషయంలోనూ నిబంధనలు పెడుతున్నాడని దుమ్మెత్తిపోశారు.
" class="align-text-top noRightClick twitterSection" data="తనపై ఆరోపణలు చేసిన వారందరికీ బుద్ధి చెప్పేందుకు రెహమాన్ కొన్ని ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. వాటిలో తన కుటుంబసభ్యులు వివిధ రకాల దుస్తుల్లో నీతా అంబానీ పక్కన కనిపించారు. నేను స్వేచ్ఛగా ఉండేలా ప్రోత్సహిస్తానో లేదో ఈ ఫోటో చూస్తే అయినా అర్థం అయ్యిందా...అంటూ విమర్శకులకు చురకలు అంటించాడు.
The precious ladies of my family Khatija ,Raheema and Sairaa with NitaAmbaniji #freedomtochoose pic.twitter.com/H2DZePYOtA
— A.R.Rahman (@arrahman) February 6, 2019
">The precious ladies of my family Khatija ,Raheema and Sairaa with NitaAmbaniji #freedomtochoose pic.twitter.com/H2DZePYOtA
— A.R.Rahman (@arrahman) February 6, 2019
The precious ladies of my family Khatija ,Raheema and Sairaa with NitaAmbaniji #freedomtochoose pic.twitter.com/H2DZePYOtA
— A.R.Rahman (@arrahman) February 6, 2019