బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. గతంలో 'కేదార్నాథ్' సినిమా విడుదలైన సమయంలో హీరోయిన్ సారా అలీఖాన్‌తో సుశాంత్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు అతని ఫామ్‌హౌస్ మేనేజర్ రయీజ్ ఈ విషయంపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సుశాంత్ 2019 జనవరిలో సారాకు ప్రపోజ్ చేయాలని అనుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే, అది వివాహానికి సంబంధించిందా లేక మరింకేదైనా అనేది తనకు తెలియదని అన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
సెప్టెంబరు 2018 నుంచి ఈ ఏడాది జులై వరకు రాజ్‌పుత్‌కు చెందిన లోనావాలా ఫామ్‌హౌస్ సంరక్షకుడిగా వ్యవహరించాడు రయీజ్. 2018 నుంచి సుశాంత్ కోసం సారా ఫామ్‌హౌస్‌కు తరచూ వస్తుండేదని రయీజ్ తెలిపాడు. అయితే, 2019 జనవరి తర్వాత ఆమె రావడం మానేసిందని పేర్కొన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"సుశాంత్ సర్‌తో కలిసి 2018 నుంచి సారా ఫామ్‌హౌస్‌కు రావడం ప్రారంభించింది. వారు అలా వచ్చినప్పుడల్లా.. మూడు, నాలుగు రోజులు ఇక్కడే ఉండేవారు. 2018 డిసెంబరులో థాయిలాండ్ పర్యటన నుంచి తిరిగి వచ్చాక.. వారిద్దరూ విమానాశ్రయం నుంచి నేరుగా ఫామ్‌హౌస్‌కు వచ్చారు. వారితో మరొక స్నేహితుడు కూడా ఉన్నాడు. సారా మేడమ్ చాలా మంచిది. అసలు ఒక నటినన్న గర్వం ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది."
-రయీజ్, సుశాంత్ ఫామ్‌హౌస్ మేనేజర్
"సుశాంత్ సర్ లాక్డౌన్ మొదలవ్వడానికి ముందు మార్చిలో ఫామ్‌హౌస్‌కు రావాలని అనుకున్నారు. ఇక్కడే రెండు మూడు నెలలు గడపాలని.. సేంద్రీయ వ్యవసాయం చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఫామ్‌హౌస్‌లో ఆయనకు అవసరమైన వస్తువుల జాబితాను శామ్యూల్ మిరండా, దీపేశ్ సావంత్‌ల చేత నాకు పంపించారు. అయితే ఆ ప్రణాళికను విరమించుకున్నారు. కొంత సామాగ్రి ముంబయి నుంచి ఫామ్‌హౌస్‌కు వచ్చింది. సుశాంత్ సర్ కూడా ముంబయి నుంచి మార్చిలో ఫామ్‌హౌస్‌కు బయలుదేరాలని అనుకున్నారు. కానీ కుదరలేదు" అని రయీజ్ తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఫామ్‌హౌస్ సిబ్బందితో ఎప్పుడూ కలిసి మెలిసి ఉండే సుశాంత్ వంటి యజమానిని ఇంతవరకూ చూడలేదని రయీజ్ తెలిపాడు. తమను ఒక కుటుంబ సభ్యుల్లా భావించేవాడని.. ఆయన అకాల మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆవేదన చెందాడు.