బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజం మరొకటి బయటకు వచ్చింది. నటుడి మృతదేహం తమ మార్చురీకి తీసుకొచ్చినప్పుడు అతడి కాలు ఒకటి విరిగిపోయి ఉండటం గమనించినట్లు కూపర్ ఆస్పత్రి సిబ్బంది ఒకరు చెప్పారు. ఈ విషయాన్ని ఆమె జాతీయ మీడియాకు చెందిన ఓ ఛానల్‌కు తెలిపారు.
"సుశాంత్ మృతదేహం పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయింది. ఓ కాలు విరిగిపోయి ఉంది. మెడపై సూదులతో గుచ్చినట్లు మచ్చలు ఉన్నాయి. అతడి మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు, ఇదే విషయమై మాట్లాడుకున్నారు. కానీ వారు ఈ అంశాన్ని అంతగా పట్టించుకోలేదు"
-కూపర్ ఆస్పత్రి సిబ్బంది
"ఈ వార్త వినగానే నా గుండె ఆగిపోయినంత పనైంది. నా సోదరుడిని చంపిన వారిని దయచేసి అరెస్టు చేయండి" అని ఈ వార్త విన్న వెంటనే సుశాంత్ సోదరి శ్వేత సింగ్ చెప్పింది.
సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కోంటోన్న నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు శోవిక్, సుశాంత్ స్నేహితుడు శామ్యుల్ మిరండా సహా పులువురిని ప్రశ్నించి, స్టేట్మెంట్స్ రికార్టు చేస్తున్నారు అధికారులు.
ఇది చూడండి 'సడక్ 2'పై కోపం సరే.. మరి మిగతా సినిమాల పరిస్థితి?