బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఇన్‌స్టా ఖాతా ఇకపై జ్ఞాపకార్థంగా ఉండనుంది. అతడి బయోలో రిమెంబర్ను జోడించిన ఇన్స్టాగ్రామ్ సంస్థ.. ఎప్పటికీ సుశాంత్ ఖాతా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇన్‌స్టా నిబంధనల ప్రకారం ఈ జ్ఞాపకార్థ ఖాతాలోకి ఎవరూ లాగిన్ కాలేరు. అతడు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలతోపాటు ట్యాగ్ చేసిన వినియోగదారులకు పోస్టులు నెటిజన్లకు కనిపిస్తాయి.
సమాచారాన్ని మార్చలేరు
అలాగే ఆ ఖాతాను జ్ఞాపకార్థంగా మార్చిన తర్వాత సుశాంత్ పోస్టులతో పాటు సమాచారంలో ఎవరూ మార్పులు చేయలేరు. ఇన్‌స్టాలో ఈ నటుడు.. చివరగా జూన్ 3న తన తల్లిని గుర్తు చేసుకుంటూ పోస్టు పెట్టాడు.
సుశాంత్ మృతిపై సాగుతున్న విచారణ
సుశాంత్ మృతిపై ముంబయి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నటి రియా చక్రవర్తి, దర్శకుడు ముఖేష్ ఛబ్రాతో పాటు కుటుంబ సభ్యులను, సన్నిహితుల్లో 13 మంది వాంగ్మూలాలు తీసుకున్నారు. సుశాంత్‌తో యశ్‌రాజ్ ఫిల్మ్స్ గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలను కోరుతూ, ఆ సంస్థకు లేఖను రాశారు.
ఇదీ చూడండి... సుశాంత్ జీవితం ఆధారంగా బాలీవుడ్ సినిమా