ETV Bharat / sitara

రియా, మహేశ్​ భట్​ వాట్సప్​ చాటింగ్​ వైరల్​!

author img

By

Published : Aug 21, 2020, 11:10 AM IST

Updated : Aug 21, 2020, 11:21 AM IST

దర్శకనిర్మాత మహేశ్​ భట్​, నటి రియా చక్రవర్తికి సంబంధించిన వాట్సప్​ చాటింగ్​ అంటూ నెట్టింట రెండు ఫొటోలు వైరల్​గా మారాయి. సుశాంత్​తో రియా ప్రేమవ్యవహారం గురించి వారిద్దరూ చర్చించుకున్నట్లు ఆ సంభాషణ ద్వారా తెలుస్తోంది.

Sushant's case: Rhea Chakraborty, Mahesh Bhatt's WhatsApp chat goes viral
నటి రియా, మహేశ్​ భట్​ వాట్సప్​ చాటింగ్​ వైరల్​!

బాలీవుడ్​ నటి రియా చక్రవర్తి, దర్శకనిర్మాత మహేశ్​భట్​లకు సంబంధించిన వాట్సప్​ చాటింగ్​ అంటూ సోషల్​మీడియాలో కొన్ని చిత్రాలు వైరల్​ అవుతున్నాయి. ఆమె ప్రియుడు, దివంగత నటుడు సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ను రియా విడిచిపెట్టిన విషయాన్ని ఆ దర్శకుడికి తెలియజేసినట్లు సందేశాల ద్వారా తెలుస్తోంది.

సుశాంత్​, రియాల ప్రేమవ్యవహారంతో హీరోయిన్​ తండ్రి సంతోషంగా లేరని మహేశ్​భట్​ చేసిన చాటింగ్​ ద్వారా తెలుస్తోంది. అదే విధంగా సుశాంత్​కు వ్యతిరేకంగా దర్శకుడు హెచ్చరించాడని సంభాషణ సూచిస్తోంది. రియా, మహేశ్​భట్​ల చాటింగ్​కు సంబంధించిన స్క్రీన్​షాట్లు అంటూ రెండు ఫొటోలు గురువారం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Sushant Singh Rajput's case: Rhea Chakraborty, Mahesh Bhatt's WhatsApp chat goes viral

వైరల్​ అయిన స్క్రీన్​షాట్ల ప్రకారం:

రియా: సార్​.. హృదయంలో కొంత ఉపశమనంతో ఈషా మూవ్ ఆన్ అయింది. మీతో మాట్లాడిన చివరి కాల్​ నాలో కొత్తదనాన్ని తెచ్చింది. మీరే నా దేవదూత. అప్పుడు, ఇప్పుడు నా వెన్నంటే ఉన్నారు. (2018లో మహేశ్​భట్​ నిర్మించిన జలేబీ చిత్రంలో రియా పేరు ఈషా)

భట్​: వెనక్కి తిరిగి చూడవద్దు. అనివార్యం అనుకున్నది సాధ్యం చేసి చూపించు. మీ తండ్రి చాలా సంతోష పడతాడు.

రియా: నాలో కొంత ధైర్యం వచ్చింది. ఆ రోజు మా నాన్న గురించి మీరు ఫోన్లో చెప్పిన మాటల వల్ల నేను బలంగా ఉన్నా. మా నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

భట్​: నువ్వు నా బిడ్డ లాంటి దానివే. నాకూ ఇప్పుడు తేలికగా అనిపిస్తుంది.

రియా: నాకు మాటలు రావడం లేదు సార్​.

ఈ సంభాషణ మొత్తం చూస్తుంటే రియా చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహేశ్​ భట్​ను ఉద్దేశిస్తూ..'ఐ లవ్​యూ మై బెస్ట్​ మ్యాన్​. మీరు గర్వించే విధంగా చేస్తా' అని రియా సందేశాన్ని పంపింది.

నటి రియా చక్రవర్తి ప్రియుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ జూన్​ 14న తన నివాసంలో అనుమానస్పదంగా మృతి చెందాడు. హీరో మృతిపై పలు అనుమాలను రేకెత్తిస్తున్న క్రమంలో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సుశాంత్​ తండ్రి కేకే సింగ్​ బిహార్​ ప్రభుత్వాన్ని అభ్యర్థించగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతించింది. మరోవైపు కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలని నటి రియా దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. సుశాంత్​ మృతి వెనకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికి సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.

Last Updated : Aug 21, 2020, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.