ETV Bharat / sitara

సుశాంత్ ​కేసులో విచారణకు ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ

సుశాంత్​ ఆత్మహత్య కేసులో నిర్మాత కరణ్​ జోహర్​కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్​ సీఈఓ అపూర్వా మెహతాను విచారించారు ముంబయి పోలీసులు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల వాంగ్ములాలను సేకరించారు.

Apoorva Mehta
అపూర్వ మెహ్త
author img

By

Published : Jul 28, 2020, 4:14 PM IST

Updated : Jul 28, 2020, 9:58 PM IST

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో సినీ ప్రముఖుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా కరణ్​ జోహర్​ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వా మెహతాను విచారించారు ముంబయి పోలీసులు. అతడి స్టేట్​మెంట్​ను రికార్డు చేశారు.

Apoorva Mehta
అపూర్వ మెహ్త

ఇప్పటికే ప్రముఖ నిర్మాత మహేశ్ భట్​, సంజయ్​ లీలా భన్సాలీ, యశ్​రాజ్​ ఫిలింస్ అధినేత​ ఆదిత్యా చోప్రా సహా 40మందిని విచారించారు పోలీసులు. ​

జూన్​ 14న సుశాంత్ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఈ నటుడి మరణానికి పలువురు సినీ ప్రముఖులు కారణమని న్యాయవాది సుధీర్​ కుమార్​ ఓజా కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలోనే ముంబయి పోలీసులు సుశాంత్​ మృతికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. అయితే, కొంత మంది సినీ ప్రముఖులు, అభిమానులు సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వాలని సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్​ చేస్తున్నారు.

ఇది చూడండి సుశాంత్​ కేసులో పోలీస్ స్టేషన్​కు ఆదిత్యా చోప్రా

Last Updated : Jul 28, 2020, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.