ETV Bharat / sitara

సుశాంత్​ కేసు: సీబీఐ దర్యాప్తు కోరుతూ మరో వ్యాజ్యం​ - సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మృతి కేసు

సుశాంత్​ మృతి వెనకున్న నిజనిజాలను తెలుసుకోవడానికి సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్​ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​. ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నేడు(ఆగస్టు 13న) విచారించనుంది.

Sushant Singh Rajput death case: SC to hear another PIL on Thursday
సుశాంత్​ కేసు: సీబీఐ దర్యాప్తు కోరుతూ మరో వ్యాజ్యం​
author img

By

Published : Aug 13, 2020, 5:31 AM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ మృతిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనికి సంబంధించిన వాదనలను సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విననుంది. ఈ కేసు దర్యాప్తులో ముంబయి పోలీసుల ప్రవర్తనతో దేశమంతా ఆశ్చర్యానికి లోనైందని.. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామని పిటిషనర్లు అఫిడవిట్​లో పేర్కొన్నారు.

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​.. జూన్​ 14న ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో దీనికి పోటీగా బిహార్​లో మరో కేసు నమోదయ్యింది.

స్వతంత్ర దర్యాప్తు అవసరం

సుశాంత్​ మృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు అవసరమని భారతీయ జనతా పార్టీ నాయకుడు, న్యాయవాది అజయ్​ అగర్వాల్​ అభిప్రాయపడ్డారు. సుశాంత్​ మృతి వెనకున్న నిజనిజాలు తెలియడానికి సీబీఐ దర్యాప్తును కోరుతూ.. పిల్​ దాఖలు చేశారు. ముంబయి పోలీసుల దర్యాప్తులో లొసుగులు ఉన్నట్లు మరో అఫిడవిట్​లో పేర్కొన్నారు న్యాయవాది అజయ్​ అగర్వాల్​.

అయితే ఈ కేసు విచారణలో భాగంగా దీనికి సంబంధించిన వార్తలను మీడియా నిలిపి వేయాలని కోరారు. అంతేకాదు, స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​. ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆగస్టు 12(గురువారం) వాదనలను వింటుంది.

రెండుసార్లు కొట్టివేత

గతంలో రెండుసార్లు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేస్తూ.. "ప్రస్తుతం మృతుడి తండ్రి కేసు నమోదు చేశారు. దాని దర్యాప్తు సరిగా జరుగుతుందా? లేదా అన్న దానికి సరైన ఆధారాలు లేవు. ఈ కేసుకు మీకు ఎలాంటి సంబంధం లేదు. మీరు అనవసరంగా ఇందులో జోక్యం చేసుకుంటున్నారు. మేము దీనికి అనుమతించం" అని స్పష్టం చేసింది.

కేసు బదిలీ పిటిషన్​

మరోవైపు పట్నాలో తనపై నమోదైన కేసును ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ నటి రియా చక్రవర్తి ఇటీవలే సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేసింది. ప్రస్తుతం జస్టిస్.హృతికేశ్​ రాయ్​ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్నారు. త్వరలోనే దీనిపై తుదితీర్పు వెలువడనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.