ETV Bharat / sitara

మరోసారి బయోపిక్​కు సిద్ధమైన సూర్య..!

author img

By

Published : Mar 23, 2020, 9:26 AM IST

తమిళ నటుడు సూర్య మరో బయోపిక్​లో నటించనున్నాడని సమాచారం. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.

సూర్య
సూర్య

సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన 'సూరరై పోట్రు' చిత్రంలో నటించాడు సూర్య. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కరోనా నేపథ్యంలో వాయిదా పడుతున్నట్లు సమాచారం. డెక్కన్‌ ఎయిర్‌వేస్‌ అధినేత గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ చిత్రం తర్వాత హరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు సూర్య. అనంతరం శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇవి పూర్తయిన తర్వాత సూర్య మరోసారి బయోపిక్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి 'కూటత్తిల్‌ ఒరుత్తన్‌' ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సూర్య కూడా కథ విన్నాడని, వెంటనే అంగీకరించాడని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.