ETV Bharat / sitara

ఇన్​స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సూర్య - #HappyBirthdaySuriya

ఇప్పటివరకు ట్విట్టర్​, ఫేస్​బుక్​లో మాత్రమే ఉన్న హీరో సూర్య.. తాజాగా ఇన్​స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. అభిమానులకు టచ్​లో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చారు.

ఇన్​స్టాలోకి హీరో సూర్య
హీరో సూర్య
author img

By

Published : Jul 23, 2020, 8:29 AM IST

కోలీవుడ్ ప్రముఖ కథానాయకుడు, నిర్మాత సూర్య.. అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ఇన్​స్టాగ్రామ్​లోకి అడుగుపెట్టారు. ఈరోజు(జులై 23) అతడి 45వ పుట్టినరోజు సందర్భంగా అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

suriya insta account
హీరో సూర్య ఇన్​స్టా ఖాతా

గతేడాది 'బందోబస్త్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూర్య.. ప్రస్తుతం 'ఆకాశమే నీ హద్దురా!'లో నటిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ చీఫ్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుధ కొంగర దర్శకురాలు. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సినా, కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించే అవకాశముంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.