కరోనా ప్రభావంతో ఇప్పటికే అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తన ఇంట్లో పనిచేసేవాళ్లకు, వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ ఇవ్వాల్సిన జీతాలను నటుడు ప్రకాశ్‌రాజ్ ముందే అందించేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
"నేను దాచుకున్న డబ్బులను పరిశీలించాను. నా నివాసం, వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నవారితోపాటు నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ ఇవ్వాల్సిన జీతాలను ముందే చెల్లించాను. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా వాయిదాపడిన నా మూడు సినిమాల కోసం పనిచేస్తున్న రోజువారీ పనివారికి కనీసం సగం జీతాలైన అందించాలనే ఆలోచనలో ఉన్నాను. నేను ఎంతవరకూ సాయం చేయగలనో అంతవరకూ చేస్తాను. మీ చుట్టూ ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి. ఒకరికోసం ఒకరూ సాయం చేసుకోవాల్సిన సమయమిది" -ప్రకాశ్‌రాజ్, నటుడు
ప్రముఖ తమిళ హీరో సూర్య కుటుంబం.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియాకు రూ.10 లక్షల విరాళం ప్రకటించింది. అందులో పనిచేసే ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవకూడదని ఈ సాయం చేశారు.