తమిళ స్టార్ హీరో సూర్య 40వ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. శుక్రవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే ఫ్యాన్స్‌కు ఈ సర్ప్రైజ్ ఇచ్చారు. 'ఎతర్కుమ్ తునింధవన్' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తుంటే మాస్ అంశాలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ ఆడిపాడనుంది. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సన్‌పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళనాడు పొల్లాచిలో రెండేళ్ల క్రితం జరిగిన గ్యాంగ్‌రేప్ కథాంశంతో రూపొందించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.