ETV Bharat / sitara

నిజ జీవితంలోనూ రజనీ మారువేషాలు.. ఎందుకంటే? - బెంగళూరులో రజనీకాంత్​ గెటప్​

సూపర్​స్టార్​ రజనీకాంత్ బెంగళూరులోని తన స్నేహితుడితో కలిసినప్పుడు​ మారువేషాల్లో వేసుకుంటారని మీకు తెలుసా? ఇంతకీ ఎందుకు అలా చేస్తారంటే?

Superstar Rajnikanth met his friend in disguise looks in bangalore dot why
నిజజీవితంలో రజనీ మారువేషాలు.. ఎందుకో తెలుసా?
author img

By

Published : Dec 12, 2020, 11:59 AM IST

పూర్వాశ్రమంలో అంటే 1969లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. బెంగళూరు శ్రీనగర్‌-మెజేస్టిక్‌ రూట్‌ సిటీ బస్సులో కండక్టర్‌. ఆ బస్‌కు డ్రైవర్‌ రాజబహదూర్‌. ఇద్దరి మధ్య స్నేహబంధం రెక్కలు తొడిగింది. రాజబహదూర్‌ ప్రోత్సాహంతో రజనీ‌ బి.టి.ఎస్‌ (బెంగుళూరు ట్రాన్స్‌ పోర్ట్‌ సర్వీస్‌) నాటకరంగ కళాకారుల బృందంలో చేరి పౌరాణిక నాటకాల్లో కర్ణుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకున్నారు. రజనీ నటనలో ఉన్న ప్రత్యేక శైలిని చూసి రాజబహదూర్‌ సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఉద్యోగానికి గుడ్‌ బై చెప్పడానికి ఇష్టపడని రజనీని రాజబహదూర్‌ ఒప్పించారు. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే తనకున్న పాల డెయిరీలో పనిచేయవచ్చని ధైర్యం చెప్పారు.

అలా రజనీ యాక్టింగ్‌ స్కూల్‌లో చేరారు. రాజబహదూర్‌, నెలకు రెండు వందలు రజనీకి మనీ ఆర్డర్‌ చేసేవారు. ఎప్పుడైనా డబ్బులు పంపలేకపోతే ఉపయోగపడేందుకు తన బంగారు గొలుసు రజనీ చేతిలో పెట్టారు. రజనీ దశ తిరిగి బాలచందర్‌ చేతిలో పడ్డారు. అపూర్వ రాగంగళ్, మూన్రాం ముడిచ్చు వంటి ప్రయోగాత్మక సినిమాలతో స్టార్​డమ్​ను అందుకున్నారు.

ఎంత ఎదిగినా తనను ప్రోత్సహించి, డబ్బు పంపి ఆదుకున్న రాజబహదూర్‌ను మాత్రం రజనీ మరవలేదు. తరచూ బెంగళూరు వెళతారు. రాజబహదూర్‌తో కలిసి విద్యార్థి భవన్‌లో నేతి దోశలు కట్టించుకుని ఎంచక్కా కృష్ణారావు పార్కులో కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇద్దరూ ఎం.జి.రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్లవెంట పబ్లిక్‌గా తిరుగుతారు. ఎక్కడంటే అక్కడ కూర్చొని కబుర్లాడుకుంటూ, జోకులు పేల్చుకుంటూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే అంతపెద్ద సూపర్‌ స్టార్‌ అంత పబ్లిక్‌గా తిరగడం ఎలా సాధ్యం అనే ప్రశ్న మనకు రాకమానదు.

Superstar Rajnikanth met his friend in disguise looks in bangalore dot why
స్నేహితుడు రాజబహదూర్​తో రజనీకాంత్​

సాధ్యం చేసి చూపాడు

సూపర్​ స్టార్​ అయినా సరే పబ్లిక్​గా తిరగడం సాధ్యం చేసి రజనీ చూపించారు. బెంగళూరు నడిబొడ్డున రజనీకి ఫ్లాట్‌ వుంది. ఆ ఫ్లాట్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు పూర్తి వృద్ధుడులా తన వేషం మార్చుకుంటారు. తర్వాత రాజబహదూర్‌ వచ్చి ఆయనను కలుస్తారు. ఇద్దరూ కలిసి మొదట్లో ఉన్న అద్దె ఇంటివైపు వెళ్తారు. గుట్టళ్లి ప్రాంతంలో ఒక బజ్జీకొట్టులో వేడివేడి బజ్జీలు, బోండాలు కొంటారు. వాటిని పార్సిల్‌ కట్టించుకొని ఉమా థియేటర్‌ దగ్గరలోని మెట్లమీద కూర్చుంటారు. వచ్చేపోయే వారిని చూస్తూ వాటిని తింటారు. తర్వాత ఆ పక్కనే ఉండే టీ పాకలో స్ట్రాంగ్‌ కాఫీ తాగుతారు. మళ్లీ నడక సాగించి బళేపేట రామన్న హోటల్‌లో బిర్యానీ పొట్లం కట్టించుకుని గంగాధర పార్కులో కూర్చొని దాన్ని లాగిస్తారు.

కొంగుకు చాటున సాయం

ఒకసారి అలా రజనీ-రాజబహదూర్‌ వెళుతూ వుంటే ఒక వృద్ధురాలు కట్టెలమోపు నెత్తికి ఎత్తుకోలేక అవస్థ పడుతూ వుండడం రజనీ గమనించారు. వెంటనే వెళ్లి ఆ మోపును ఆ వృద్ధురాలి నెత్తిమీదకు చేర్చారు. ఆమె వెంట కొంచెం దూరం నడిచి ఎవరూ గమనించడం లేదని రూఢీ పరచుకున్న తరువాత జేబులోనుంచి చేతికి వచ్చినంత డబ్బులు తీసి ఆమె చీర కొంగుకు కట్టారు. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఇంటికి వెళ్లిన తరువాత కొంగుముడి విప్పమని చెప్పి రాజబహదూర్‌తో అదృశ్యమయ్యారు. ఆ కొంగుముడిలో రజనీ వదలిన డబ్బుతో ఆమె ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. అది అంత పెద్ద మొత్తం! అలా ఒకరికి కాదు తోపుడు బండిని తోయలేక అవస్థపడుతున్న వృద్ధుడికి, చిత్తు కాగితాలు ఏరుకునే నిరుద్యోగికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలికి అలా డబ్బు ఇచ్చి సాయం చేసేవారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.