ETV Bharat / sitara

రజినీకాంత్​కు అస్వస్థత..​ జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్

superstar-rajinikanth-admitted-in-apollo-hospital-in-jubilee-hills
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌
author img

By

Published : Dec 25, 2020, 1:09 PM IST

Updated : Dec 25, 2020, 5:15 PM IST

13:08 December 25

అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్‌

superstar-rajinikanth-admitted-in-apollo-hospital-in-jubilee-hills
అపోలో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటుతో హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ అపోలో ఆస్పత్రిలో చేరారు. రజినీకి బీపీలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు.  

కొవిడ్​ లక్షణాలు లేవు

రజినీకి ఎలాంటి కొవిడ్​ లక్షణాలు లేవని... ఈ నెల 22 న నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిందని అపోలో వైద్యులు వివరించారు. బీపీలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నాయని... అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రజినీకాంత్‌కు బీపీ తప్ప... మరే ఇతర ఇబ్బందులు ఏమీలేవని వైద్యులు స్పష్టం చేశారు. రక్తపోటు నియంత్రణలోకి వచ్చేవరకూ పర్యవేక్షణలో ఉంచుతామని.. ఆ తర్వాత సూపర్‌స్టార్‌ను డిశ్చార్జి చేస్తామని ప్రకటించారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నత్తై చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.  

పవర్​స్టార్​ స్పందన

రజినీకాంత్‌ అస్వస్థత చెందటంపై పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ స్పందించారు. ఆస్పత్రిలో చేరినట్లు తెలిసి బాధపడ్డానని పవన్​ తెలిపారు. కరోనా లక్షణాలు లేవని తెలపడం ఊరటనిచ్చిందన్న పవన్​... సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

గవర్నర్‌ ఆకాంక్ష

రజినీకాంత్‌ ఆరోగ్యం గురించి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అడిగి తెలుసుకున్నారు. అపోలో వైద్యులతో మాట్లాడిన సూపర్ స్టార్ ఆరోగ్యం వివరాలపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. 

ఇదీ చూడండి : క్రిస్మస్​ వేడుకల్లో 'మెగా' కజిన్స్

Last Updated : Dec 25, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.