ETV Bharat / sitara

సూపర్​స్టార్ ఖాతాలో​ మరో మిలియన్​

అగ్ర కథానాయకుడు మహేశ్​బాబు ఖాతాలో మరో మైలురాయి చేరింది. సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఇన్​స్టాగ్రామ్​లో ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య 6 మిలియన్లు దాటింది.

superstar news
సూపర్​స్టార్ ఖాతాలో​ మరో మిలియన్​..
author img

By

Published : Nov 24, 2020, 7:40 PM IST

సూపర్‌స్టార్‌ మహేశ్​బాబు మరోసారి 6 మిలియన్ల క్లబ్​లో చేరిపోయారు. తన ఇన్​స్ట్రాగ్రామ్​ అకౌంట్​ ద్వారా ఈ ఫీట్​ అందుకున్నారు. కొన్నిరోజులుగా ప్రిన్స్​ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. సినిమా అప్​డేట్లనూ ఈ వేదికల ద్వారానే వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే మహేశ్​కు ట్విట్టర్​లోనూ మంచి ఆదరణ ఉంది. 10.9 మిలియన్ల అనుచరులతో అత్యధిక ఫాలోవర్లు కలిగిన దక్షిణాది నటుడిగా ఇప్పటికే మహేశ్​ పేరిట రికార్డు నమోదైంది.

superstar maheshbabu
సూపర్​స్టార్ మహేశ్​బాబు

ఇటీవలే సూపర్​స్టార్ మహేశ్​బాబు కొత్త సినిమా 'సర్కారు వారి పాట' లాంఛనంగా ప్రారంభమైంది. ఆయన కుమార్తె సితార క్లాప్ కొట్టగా, సతీమణి నమ్రత కెమెరా స్విచాన్ చేశారు. జనవరి తొలివారం నుంచి షూటింగ్​ ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు కీర్తి సురేశ్ హీరోయిన్​. పరశురామ్ దర్శకుడు. తమన్ సంగీతం సమకూర్చనున్నారు. 14 రీల్స్​ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకు మోసాల నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.