'సరిలేరు నీకెవ్వరు'తో విజయాన్నందుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం కాస్త విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ప్రిన్స్ తర్వాతి సినిమాపై టాలీవుడ్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
మహేశ్ బాబు ,‘'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడనే వార్తలు చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా ప్రశాంత్.. మహేశ్ బాబుకు ఒక స్టోరీ లైన్ చెప్పాడని, అది మహేశ్‌కు బాగా నచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్.
అయితే మహేశ్.. ప్రశాంత్ నీల్‌ను మెగా నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వద్దకు కథ వినిపించేందుకు పంపాడట. అన్నీ కుదిరితే త్వరలోనే ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలున్నాయట. అంటే వీరిద్దరి కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహించడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది.