ETV Bharat / sitara

క్రీడానేపథ్యంతో సినిమాలు.. నయా సక్సెస్​ మంత్ర!

author img

By

Published : Apr 27, 2021, 9:32 AM IST

Updated : Apr 27, 2021, 11:46 AM IST

క్రీడానేపథ్యంతో వచ్చే సినిమాలకు చిత్రసీమలో మంచి డిమాండ్​ ఉంది. కచ్చితమైన కథతో కాస్త వైవిధ్యమైన స్క్రీన్​ప్లే పడితే ఆ బొమ్మ సూపర్​హిట్​ అని అనేకసార్లు రుజువైంది. అప్పటి 'విజేత' నుంచి నిన్నటి 'జెర్సీ' వరకు ప్రేక్షకుల ముందుకొచ్చిన అనేక క్రీడానేపథ్య చిత్రాలను విశేషంగా ఆదరించారు. అలా టాలీవుడ్​ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్పోర్ట్స్​ బ్యాగ్రౌండ్​ చిత్రాలు ఏవో తెలుసుకుందాం.

Super hit Telugu movies with sports theme
క్రీడాస్ఫూర్తిని నిలిపే తెలుగు చిత్రాలు

క్రికెట్​కు భారత్​లో ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్​ను ఓ మతంలా.. సచిన్​ తెందూల్కర్​ను క్రికెట్​ దేవుడిగా భావించే మన దేశంలో ఇతర క్రీడలకు అదే స్థాయిలో ప్రాముఖ్యం ఉంది. అంతటి ప్రేమ వల్లనే కాబోలు.. క్రీడానేపథ్యంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రతి చిత్రం బ్లాక్​బాస్టర్​ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

మెగాస్టార్​ చిరంజీవి నటించిన అప్పటి 'విజేత' చిత్రం నుంచి నిన్నమొన్నటి 'జెర్సీ' వరకు టాలీవుడ్​లో క్రీడాసినిమాలకు మంచి గిరాకీ ఉంది. సగటు ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకులూ.. స్పోర్ట్స్​ కథతో, పక్కా డ్రామాతో, కచ్చితమైన స్క్రీన్​ప్లేతో సూపర్​హిట్​ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు వచ్చిన క్రీడానేపథ్య చిత్రాలేవో చూద్దాం.

క్రికెట్​ నేపథ్యంతో..

టాలీవుడ్​లో క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, అందులో యువ కథానాయకుడు నాని నటించిన 'జెర్సీ' చిత్రం ప్రత్యేకమనే చెప్పాలి. అప్పటివరకు ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో క్రికెట్​ గురించి ప్రధానంగా తెరపై చూపించలేదు. కానీ, జాతీయజట్టులో స్థానం దక్కించుకోవాలనే లక్ష్యంతో క్రికెటర్​గా మారిన కుర్రాడు.. అనుకోని కారణాల వల్ల క్రికెట్​కు దూరమవుతాడు. పెళ్లి తర్వాత తన కుమారుడి కోరిక మేరకు మళ్లీ బ్యాట్​ పడతాడు. అలా తన లక్ష్యం కోసం పరుగెత్తుతూ గెలిచాడా? ఓడాడా? అనేది కథాంశం. ఈ సినిమాను కేంద్రప్రభుత్వం గుర్తించి.. జాతీయ అవార్డుకు ఎంపికచేసింది. ఇందులో నాని, శ్రద్ధాశ్రీనాథ్​ ప్రధానపాత్రలు పోషించారు.

Super hit Telugu movies with sports theme
జెర్సీ

ఈ సినిమాతో పాటు తెలుగులో విడుదలైన 'మజిలీ' చిత్రం నాగచైతన్య, సమంత కెరీర్లో సూపర్​హిట్​ చిత్రంగా నిలిచింది. క్రికెట్​తో పాటు ప్రేమ అంశంతో దర్శకుడు రాసుకున్న కథ ప్రేక్షకుల మనసును తట్టిలేపింది. ఐశ్వర్యారాజేశ్​ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేశ్​ నటించిన 'వసంతం', సుమంత్​ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గోల్కొండ హైస్కూల్​', ప్రకాశ్​రాజ్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధోనీ', నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలుగా నటించిన 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలూ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.

మజిలీ

అప్పట్లో ఒంకడుండేవాడు

కబడ్డీ..

సూపర్​స్టార్ మహేశ్​ బాబును మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'ఒక్కడు'. ఫ్యాక్షన్​తో పాటు కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహేశ్​ కెరీర్​లో బంపర్​ హిట్​గా నిలిచింది. ఇందులో మహేశ్​తో పాటు భూమిక, ప్రకాశ్​ రాజ్​ కీలకపాత్రలు పోషించారు. దీంతో పాటు తెలుగులో కబడ్డీ నేపథ్యంతో అనేక చిత్రాలొచ్చాయి. అందులో నాని నటించిన 'భీమిలి కబడ్డీ జట్టు', జగపతిబాబు హీరోగా నటించిన 'కబడ్డీ..కబడ్డీ' చిత్రాలు తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి.

ఒక్కడు

బాక్సింగ్​ కథాంశంతో..

సుబ్రహ్మణ్యం(సుబ్బు)(పవన్​కల్యాణ్​) అల్లరిచిల్లరిగా తిరిగే ఓ కుర్రాడు. కాలేజీ పరీక్షల్లో కాపీ కొట్టడం, స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటుపడ్డ కుర్రాడు. సుబ్బు చేసే చేష్టలతో విసిగిపోయిన తండ్రి అతడిపై కోపం ఎక్కువ. సుబ్బు అన్న చక్రి(అచ్యుత్​) బాక్సర్​గా ఓ టోర్నమెంట్​లో గెలవాలన్నది అతడి కల. అయితే అనుకోని ప్రమాదం వల్ల చక్రి చేతులు, కాళ్లు విరిగి ఆస్పత్రి పాలవుతాడు. అయితే తన అన్న ఆస్పత్రి పాలవ్వడానికి కారణమైన వాళ్లపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు సుబ్బు. తన అన్నయ్యకు ఇష్టమైన బాక్సింగ్​ నేర్చుకొని ఇంటర్​ కాలేజీ ఛాంపియన్​షిప్​లో విజేతగా నిలిచి తన అన్న కల నెరవేరస్తాడు. అలా బాక్సింగ్​లో ట్రోఫీ నెగ్గిన సుబ్బు అందరి హృదయాలను గెలుచుకుంటాడు. ఇదీ పవన్ హీరోగా నటించిన 'తమ్ముడు' కథ. పవర్​స్టార్ కెరీర్​లో సూపర్​హిట్​గా నిలిచింది.

తమ్ముడు

Super hit Telugu movies with sports themeSuper hit Telugu movies with sports theme
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
గురు

అయితే బాక్సింగ్​ నేపథ్యంతో టాలీవుడ్​లో అనేక చిత్రాలొచ్చాయి, వస్తున్నాయి. పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో మాస్​ మహారాజ్​ రవితేజ హీరోగా నటించి చిత్రం 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'. ఈ సినిమా అటు రవితేజ, ఇటు పూరీ జగన్నాథ్ కెరీర్​లో బ్లాక్​బాస్టర్​ హిట్​గా నిలిచింది. వీటితో పాటు విక్టరీ వెంకటేశ్​ ప్రధానపాత్రలో నటించిన 'గురు', 'తుంటరి', '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే బాక్సింగ్​ నేపథ్యం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. బాక్సింగ్​ నేపథ్యంతో ప్రస్తుతం తెలుగులో 'గని', 'లైగర్'​ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నాయి.

గని

లైగర్​

చిరంజీవి 'విజేత'

ఫుట్​బాల్​పై ఆసక్తితో ప్రతిభ ఉన్న మధుసూధన రావు(చిరంజీవి) అనే ఆటగాడు.. ఎప్పటికైనా అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన కుటుంబానికి దూరమవుతాడు. తన సోదరి పెళ్లికి పెద్ద మొత్తంలో డబ్బు అందజేసి తన తండ్రి కష్టంలో పాలుపంచుకుంటాడు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నది 'విజేత' కథకు కీలకమలుపు. 1985లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో చిరంజీవి, భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్​లో ఈ సినిమా సూపర్​హిట్​గా నిలిచింది.

విజేత

నితిన్​ 'చెక్​', 'సై'!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నితిన్​, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'సై'. రగ్బీ క్రీడానేపథ్యంతో తెరకెక్కిన చిత్రం సూపర్​హిట్​గా నిలిచింది. అయితే ఈ క్రీడతో తెలుగు చిత్రసీమలో వచ్చిన తొలిచిత్రం ఇదే కావడం విశేషం.

సై

చెక్​

నితిన్ ప్రధానపాత్రలో చంద్రశేఖర్​ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'చెక్​'. చెస్​ నేపథ్యంలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టకపోయినా.. కథ, కథనంపై విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.

శ్రీహరి 'భద్రాచలం'

ఓ పల్లెటూరి వ్యక్తి తైక్వాండోలో జాతీయ స్థాయికి ఎదగడం సహా తన సొంతూరికి గుర్తింపు తెచ్చిన కథాంశంతో రూపొందిన చిత్రం 'భద్రాచలం'. ఇందులో రియల్​స్టార్​ శ్రీహరి ప్రధానపాత్రలో నటించారు. ఆయన కెరీర్​లో ఈ సినిమా ఓ కీలకమలుపుగా నిలిచిపోయింది.

సందీప్​కిషన్​ 'ఏ1 ఎక్స్​ప్రెస్​'

ఏ1 ఎక్స్​ప్రెస్​

అంతర్జాతీయ టోర్నీల్లో హాకీ జాతీయజట్టులో భారత్​ తరఫున ప్రాతినిధ్యం వహించాలనే ఓ కుర్రాడి కల. అయితే అతడి కల తీరే సమయానికి అనేక మలుపులు, రాజకీయ ఎత్తుగడలు. వీటన్నిటినీ దాటుకోవడానికి ఆ కుర్రాడు ఏం చేశాడన్నది కథ. సందీప్​ కిషన్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో విజయం దక్కకపోయినా సందీప్​ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఇదీ చూడండి..సీటీమార్ ఇచ్చావ్.. థ్యాంక్స్ బన్నీ: సల్మాన్​

Last Updated : Apr 27, 2021, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.