పోర్న్ స్టార్‌గా ప్రస్థానం మొదలుపెట్టి ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా ఉన్న సన్నీలియోనీ... సరికొత్త అవతారం ఎత్తింది. వ్యాపారవేత్తగా మారి మహిళల లోదుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించింది. కథానాయికగా ఫుల్ బిజీగా ఉన్న ఈ సుందరి.. 'ఇన్‌ఫేమస్ బై స్టార్ట్ స్ట్రక్' పేరుతో తన ఉత్పత్తులకు ప్రచారం చేసుకుంటోంది.
ముంబయిలో మంగళవారం జరిగిన ఇండియా లైసెన్సింగ్ ఎక్స్పో -2019లో తన నూతన బ్రాండ్ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది. ఇది దేశంలోనే అతిపెద్ద బ్రాండ్ లైసెన్సింగ్ వేదిక. ప్రజల్లోకి తీసుకెళ్లి వ్యాపారాన్ని మరింత పెంచకోడానికి బ్రాడ్ఫోర్డ్ లైసెన్స్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది సన్నీ. ఫలితంగా 262 బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన సంస్థలో భాగమైంది.
" ఇన్ఫేమస్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. రిటైల్ రంగంలో మా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు ఐఎల్ఈ వంటి ఓ ప్రతిష్టాత్మక వేదిక దొరికింది. ఇన్‌ఫేమస్ బ్రాండ్‌ను వయసుతో సంబంధం లేకుండా అందరి మహిళలు ఆదరిస్తారని ఆశిస్తున్నా".
-- సన్నీలియోనీ, సినీ నటి.