వేధింపులను సహించకండి అని అంటోంది బాలీవుడ్ నటి సన్నీలియోనీ. తన స్టైల్‌తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ.. ఇన్‌స్టా వేదికగా తరచూ ఎన్నో విశేషాలను షేర్ చేస్తూ ఉంటోంది. పని ప్రదేశాల్లో వేధింపులను మహిళలు సహించకండి అని చెబుతూ ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంది.
పనివేళల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలియచేసేలా ఈ వీడియో ఉంది. ఇందులో సన్నీలియోనీ ఓ అధికారిలా కనిపించింది. "పనిచేసే చోట వేధింపులను తట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాటిపై మౌనంగా ఉండకండి" అని సన్నీ రాసుకొచ్చింది.
సన్నీలియోనీ.. ప్రస్తుతం 'కోకో కోలా' సినిమాలో నటిస్తోంది. హారర్ కామెడీ కథాంశంతో తీస్తున్నారు. దక్షిణాదిలో 'రంగీలా', 'వీరమదేవి' చిత్రాల్లో నటించనుంది. మరోవైపు పలు రియాల్టీ షోలలోనూ సన్నీ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇది చదవండి: సన్నీలియోనీ కన్నా ధోనితోనే యమ డేంజర్ గురూ