ETV Bharat / sitara

బర్త్​డే స్పెషల్​ : 'మర్యాద రామన్న'

సునీల్‌ ఒకానొక దశలో హాస్యనటుడిగా టాలీవుడ్​లో శిఖర స్థాయిని అందుకున్నాడు. హీరోగా మారి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మళ్లీ పాత ట్రాక్​లోకే వచ్చేశాడు. నేడు ఈ నవ్వుల రారాజు 47వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు.

sunil_
బర్తడే స్పెషల్​ : 46వ ఒడిలోకి 'మర్యాద రామన్న'
author img

By

Published : Feb 28, 2020, 5:16 AM IST

Updated : Mar 2, 2020, 7:59 PM IST

సునీల్.. టాలీవుడ్​కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్రసీమలో టాప్​ మోస్ట్​ కమెడియన్​. తెరపై కనిపించాడంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాల్సిందే. చిత్రపరిశ్రమలో ఎంతోమంది హాస్యనటులు ఉన్నా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో చిత్రాల్లో హాస్య ప్రధానమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరించిన సునీల్ నేడు 47వపుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడి గురించి ప్రత్యేక కథనం. ​

sunil
సునీల్​ పుట్టినరోజు

సినీ కేరీర్​ అలా మొదలైంది

దాదాపుగా 200 చిత్రాలు చేసిన సునీల్‌ అసలు పేరు ఇందుకూరి సునీల్‌ వర్మ. భీమవరంలో పుట్టాడు. తండ్రి కేంద్ర తపాలాశాఖ ఉద్యోగి. సునీల్‌కు ఐదేళ్ళ వయసున్నప్పుడు తండ్రి మరణించగా తల్లికి ఆ ఉద్యోగం వచ్చింది. విద్యాభాసం భీమవరంలోనే సాగింది. సినిమాల మీద మక్కువతో ఆ ఊరులోనే ఉన్న కళాశాలలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులో చేరాడు.

అప్పట్లో అక్కడ నాటకాలలో శిక్షణ ఇవ్వడానికి రాజా వన్నెంరెడ్డి వెళ్లేవారట. అప్పటికింకా ఆయన దర్శకుడు కాలేదు. అలా నటనపై మరింత మక్కువ పెంచుకున్నాడు సునీల్‌. మెగాస్టార్​ చిరంజీవిపై అభిమానంతో చిరు నటననూ, డ్యాన్సుల్నీ అనుకరించేవాడు. అలా చిత్ర పరిశ్రమ వైపు అడుగులేశాడు.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. సునీల్‌ మంచి స్నేహితులు. ఇద్దరూ రూమ్మేట్స్‌. రచయితగా ఏ సినిమాకు కథ రాసినా, తన స్నేహితుడిని దృష్టిలో ఉంచుకుని మంచి పాత్రల్ని సృష్టించేవాడు త్రివిక్రమ్‌. అలా అతడు రాసి, దర్శకత్వం వహించిన చిత్రాలతో సునీల్‌కు హాస్యనటుడిగా మరింత పేరొచ్చింది. క్రమక్రమంగా మోస్ట్​ వాంటెడ్​ కమెడియన్​గా ప్రేక్షాదరణ పొందాడు.

sunil_
సునీల్​, తివిక్రమ్​

కథానాయకుడిగా

ఆ తర్వాత హీరోగానూ మారాడు. 'అందాల రాముడు', 'మర్యాదరామన్న', 'పూలరంగడు' వీటిలో ఏ పేరు వినిపించినా నవతరానికి గుర్తుకొచ్చేది సునీలే. వాటితో పాటే 'మిస్టర్‌ పెళ్ళికొడుకు', 'తడాఖా', 'భీమవరం బుల్లోడు', 'కృష్ణాష్టమి', 'జక్కన్న', 'ఈడు గోల్డ్‌ ఎహే', 'ఉంగరాల రాంబాబు' తదితర చిత్రాల్లో కథానాయకుడిగా నటించి, ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే వీటిలో కొన్ని చిత్రాలు సరైన ప్రేక్షాదరణ పొందకపోవడం వల్ల మళ్లీ తనకు అచ్చొచ్చిన హాస్య పాత్రలవైపు దృష్టి మళ్లించాడు. 'అరవింద సమేత', 'పడి పడి లేచే మనసు'.. తాజాగా 'అల వైకుంఠపురములో ' సినిమాలతో మళ్లీ కమెడియన్​ ట్రాక్​ ఎక్కాడు.

సునీల్‌ది పెద్దలు కుదిర్చిన వివాహం. భార్య పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. వీరిద్దరికీ ఓ పాప.

sunil
సునీల్​ పుట్టినరోజు
sunil
సునీల్​ పుట్టినరోజు

ఇదీ చూడండి : నాపై పుస్తకం రాస్తే.. అతడి పేరు ఉండాల్సిందే: తాప్సీ

Last Updated : Mar 2, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.