'యువకుడు', 'గౌరి'లాంటి చిత్రాలతో నటించి మెప్పించిన ఏయన్నార్ మనవడు సుమంత్ యార్లగడ్డ. ప్రస్తుతం ఆయన ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో 'కపటధారి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నందితా శ్వేత నటిస్తోంది. జి.ధనంజయన్ సమర్పణలో లలితా ధనంజయ్ నిర్మిస్తున్న చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ అధికారిగా కనిపించిన పోస్టర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటోంది. సుమంత్ సీరియస్ లుక్‌తో పాటు ఆర్టికల్ 352, ఎఫ్.ఐ.ఆర్.. వంటి ఆంగ్ల పదాలు, పుర్రె గుర్తుతో టైటిల్ లోగోను డిజైన్ చేయడం వల్ల వైవిధ్యంగా కనిపిస్తోంది. ఇందులో నాజర్, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్నారు. సైమన్ కె. కింగ్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.