Jayamma panchayathi teaser: తన కుమార్తె మహిళా ప్రాధాన్యత ఉన్న మంచి చిత్రంలో నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో కోరుకునేదానని ప్రముఖ యాంకర్ సుమ కనకాల తల్లి విమలమ్మ అన్నారు. తన ఆకాంక్ష 'జయమ్మ పంచాయితీ' సినిమాతో తీరిందని ఆనందం వ్యక్తం చేశారు.
'జయమ్మ పంచాయితీ' టీజర్ విడుదల కార్యక్రమానికి కుమార్తె సుమతో కలిసి వచ్చిన ఆమె.. టీజర్ చూసి ఎంతో సంతోషించారు. ఈ వేడుకల్లో రానా సమక్షంలో అభిమానులకు సుమ తన తల్లిని పరిచయం చేశారు. తన ఎదుగుదలకు విమలమ్మ ఎంతో శ్రమించారని సుమ చెప్పారు. అయితే తన కుమార్తె వ్యాఖ్యాతగానే కాకుండా మంచి నటి అని విమలమ్మ అన్నారు. సుమ 'జయమ్మ పంచాయితీ'.. మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Suma jayamma panchayathi teaser: అంతకుముందు రామానాయుడు స్టూడియోస్‌లో 'జయమ్మ పంచాయతీ' టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రానా.. అన్ని భాషల్లో నటించగల సత్తా ఉన్న నటి సుమ అని పేర్కొన్నారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.
విలేజ్ బ్యాక్డ్యాప్తో తెరకెక్కించిన ఈ సినిమాకు విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. బలగ ప్రకాశ్ నిర్మించారు. త్వరలో విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: