మెగాస్టార్ చిరంజీవి.. చిత్రసీమలోకి రీఎంట్రీ ఇవ్వగానే అభిమానులు నీరాజనం పట్టారు. 'ఖైదీ 150', 'సైరా నరసింహరెడ్డి' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అయితే ఈ సినిమా ఫలితాల జోష్‌తో వరుస సినిమాలకు ఓకే చెప్పాడీ స్టార్హీరో. ప్రస్తుతం మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం.
యువత నాడిపట్టిన దర్శకుడే..
తండ్రి కోసమే ఈ సినిమా హక్కుల్ని రామ్‌చరణ్ సొంతం చేసుకొన్నాడట. తాజాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యత సుకుమార్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. యువత మెచ్చే సినిమాలు చేయడంలో దిట్ట అయిన ఈ స్టార్ డైరెక్టర్.. ప్రస్తుతం 'లూసిఫర్' స్క్రిప్ట్‌ను తెలుగు నేటివిటీకి అణుగుణంగా మార్పులు చేసే పనిలో పడ్డాడట. మలయాళ చిత్రంలో మోహన్‌లాల్ పోషించిన పాత్రని చిరంజీవి... పృథ్వీరాజ్ క్యారెక్టర్‌ను రామ్‌చరణ్ చేసే అవకాశాలున్నట్టు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి.. బాహుబలి రికార్డుపై 'ఆర్ఆర్ఆర్' కన్ను!