తమిళ నటుడు అరుణ్ విజయ్-దర్శకుడు అరివళగన్ కాంబోలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాకు 'బోర్డర్' అని టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రెజీనా కీలక పాత్ర పోషిస్తోంది. మే చివరి వారంలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశముంది.
కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోనా' విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాన్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: హిందీ 'అపరిచితుడు'కు ఆదిలోనే షాక్