ETV Bharat / sitara

'నా ఎదుగుదలకు కారణం అలాంటి సవాళ్లే'

author img

By

Published : Apr 12, 2021, 8:21 AM IST

పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన 'వకీల్​సాబ్' చిత్రంలో వేముల పల్లవి పాత్రలో ఒదిగిపోయింది నివేదా థామస్. ఈ పాత్రకుగానూ ప్రశంసలూ అందుకుంటోంది. తాజాగా థియేటర్లో సినిమా చూసిన నివేదా ఈటీవీ భారత్​తో ముచ్చటించింది.

Nivetha Thomas
నివేదా థామస్

పాత్రల్లో కొద్దిమంది నటిస్తారు. కొద్దిమందే జీవిస్తారు. ఇందులో రెండో రకం.. నివేదా థామస్‌. తెరపైన పాత్రలు తప్ప.. నివేదా అనే విషయం ఎప్పుడో కానీ గుర్తుకురాదు. 'వకీల్‌సాబ్‌'లో వేముల పల్లవి.. ఆమె సంఘర్షణ, ఆమె పోరాటమే కనిపిస్తుంది. ఎక్కడా ఇది పాత్ర, ఇది నటన అని ఎప్పుడూ అనిపించదు. నివేదా అంత సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సందర్భంగా నివేదా థామస్‌తో ఈటీవీ భారత్ ముచ్చటించింది. ఆమె చెప్పిన విషయాలివీ..

ప్రేక్షకుల మధ్య 'వకీల్‌సాబ్‌' సినిమాని చూశారు కదా. థియేటర్లో ఎలాంటి స్పందన కనిపించింది?

ప్రత్యక్షంగా ప్రేక్షకుల స్పందనని ఆస్వాదించడానికే నేను థియేటర్‌కి వెళతా. వాళ్లు చప్పట్లు కొడుతున్న ఆ క్షణాల్ని చూసేందుకే సినిమా చేస్తాం. నా వరకు నేను ప్రేక్షకులతో కలిసి సినిమా చూసుకున్నాకే సమీక్షలు చదువుతా. ఆ తర్వాతే స్నేహితులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాల్ని తెలుసుకుంటా. 'వకీల్‌సాబ్‌' విడుదలకి ముందు వారం పైగా ఒంటరిగా హోటల్‌ గదిలో గడిపా. సినిమా విడుదలైన 9వ తేదీ నుంచి నా సెల్‌ఫోన్‌ మోగడం మొదలు పెట్టింది. 'వకీల్‌సాబ్‌'కి వస్తున్న స్పందన అంతా ఇంతా కాదు. నేను చాలా హ్యాపీ.

Nivetha Thomas
వకీల్​సాబ్ చూస్తోన్న నివేదా

వేముల పల్లవి పాత్రలో ఒదిగిపోయారు. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారా?

పల్లవికి ఎదురైన అనుభవాలు నా జీవితంలో ఎదురుకాలేదు. కానీ నా స్నేహితుల జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగాయి. అలాంటివన్నీ విన్న నాకు మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న కష్టాలపై ఓ అవగాహన ఉంటుంది కదా. పల్లవి పాత్ర ప్రతి అమ్మాయికీ రిలేట్‌ అవుతుంది. తమని తాము చూసుకునే ఓ పాత్ర అది. అందుకే పల్లవిగా నటించడం ఓ పెద్ద బాధ్యతగా భావించా. అలా అని మరీ లోతుగా ఆలోచిస్తే పాత్ర డ్రమటిక్‌గా అవుతుంది. అందుకే ఈ సినిమాని సగటు కథలాగే చూశా. అందుకే ఒక అమ్మాయి పడిన బాధ, ఆ నొప్పి అంత సహజంగా తెరపైకొచ్చింది. 'పింక్‌' సినిమా రెండుసార్లు చూశా. 'వకీల్‌సాబ్‌'కి సంతకం చేశాక మాత్రం చూడలేదు. సినిమా పరంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం స్క్రిప్టే. ఎముకల గూడు లేకపోతే మన దేహం ఎలా నిలబడదో, సరైన రచన లేనప్పుడు పాత్రా అంతే. బాగా రాసిన ఓ స్క్రిప్టు ఉందంటే నటుల పని సగం పూర్తయినట్టే. ఇదే కాదు, ఏ సినిమా విషయంలోనైనా రచనే నటుల్ని, సినిమా ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల విశేషాలు?

సురేష్‌ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నా. ఇదివరకు సినిమాలతోపాటు చదువూ ఉండేది. గతేడాదితో నా చదువు పూర్తయింది. ఇకపై సినిమాలపైనే పూర్తిగా దృష్టిపెడతా.

Nivetha Thomas
నివేదా థామస్

కరోనా లేకపోతే విజయాన్ని ఇంకా బాగా ఆస్వాదించేవారేమో కదా?

కొన్ని వేడుకల్ని మిస్‌ అయ్యానంతే. మిగతాదంతా మామూలే. సినిమా విడుదల తర్వాత అదృష్టవశాత్తూ కొవిడ్‌ పరీక్షల్లో నాకు నెగిటివ్‌ వచ్చింది. దాంతో శనివారం కొన్ని గంటలపాటు బయటికొచ్చి థియేటర్లో సినిమాని చూశా. మళ్లీ హోటల్‌ గదికి వచ్చి ఐసోలేట్‌ అవుతున్నా. వైద్యుల బృందం పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నా.

పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించిన అనుభవం గురించి ఏం చెబుతారు?

ఇలాంటి కథని ఆయన ఎంపిక చేసుకుని, సినిమా చేసినందుకు కృతజ్ఞతలు చెబుతాను. ఆయన సెట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు పంచుకుంటారు. అవి చాలా ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా ఉంటాయి. ఈ సినిమాతో నేను సాధించిన విజయంగా భావించేదేమిటంటే.. ఇందులోని సందేశం ఎక్కువ మందికి చేరువ కావడం. అది పవన్‌కల్యాణ్‌ వల్లే సాధ్యమైంది. సమాజం ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలపై కథలు మరిన్ని రావాలి. సినిమాలతో రాత్రికి రాత్రే మార్పు వస్తుందనుకోను. ఒక ఆలోచన మొదలవుతుంది. 'వకీల్‌సాబ్‌' చూశాక మహిళల గురించి మనకు నచ్చిన ఉద్దేశాలు ఆపాదించడం సరైనది కాదనే ఆలోచనలు ప్రారంభమయ్యాయి.

Nivetha Thomas
నివేదా థామస్

పాత్ర నిడివితో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. అంత తక్కువ సమయంలో ప్రేక్షకులపై ప్రభావం చూపించగలమో? లేదో? అనే భయాలేమీ ఉండవా?

నిజానికి అలాంటి సవాళ్లే నాకు కావాలి. అందుకోసమే నేను సినిమాలు చేస్తా. '118' సమయంలో అదే అనుకున్నా. అందులో నా పాత్ర నిడివి 20 నిమిషాలే. ఆ తక్కువ సమయంలోనే ప్రేక్షకుల్ని నమ్మించాలి. అది చాలా పెద్ద ఛాలెంజ్‌. భయపడి వెనక్కి తగ్గకూడదు. అలాంటి సవాళ్లు ఎదురైనప్పుడే మనలోని ప్రతిభ బయటికొస్తుంది. నేను ఎదగడానికి కారణం అలాంటి సవాళ్లు నాకు తరచూ ఎదురు కావడమే. చిన్న పాత్ర, పెద్ద పాత్రా? ఎక్కువ బడ్జెట్‌తో కూడిన సినిమానా? తక్కువ బడ్జెట్టా? అనే లెక్కల్ని నేనెప్పుడూ పట్టించుకోను. సినిమాలోని ప్రతి పాత్ర నాకూ సమానమే. మంచి రచనతో కూడిన కథ నచ్చిందంటే మిగతా విషయాలేవీ పట్టించుకోకుండా నటిస్తుంటా.

నివేదా అనగానే మంచి నటి అనే విషయం గుర్తుకొస్తుంది. అది చాలని భావిస్తారా? ఇంకా లక్ష్యాలేమైనా ఉన్నాయా?

Nivetha Thomas
నివేదా థామస్

నటిగా నా పని విషయంలో నేనెప్పుడూ సంతృప్తి పడిపోను. ఇలా ఉంటే బాగుండేదేమో, అలా చేసుండాల్సింది అంటూ రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు నేనెక్కడున్నాను? నా కోసం ఎలాంటి పాత్రలు సిద్ధం అవుతున్నాయనే విషయం గుర్తుకొచ్చినప్పుడు తృప్తిగా ఉంటుంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.