ETV Bharat / sitara

'పుష్ప' కోసం కనీవినీ ఎరగని రీతిలో బోట్​ఫైట్! - 'పుష్ప' కోసం కనీవినీ ఎరగని రీతిలో బోట్​ఫైట్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్​టైనర్ 'పుష్ప'. ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో భారీ బోట్​ఫైట్​ను తెరకెక్కించబోతున్నారట.

pushpa
పుష్ప
author img

By

Published : Jun 15, 2021, 7:12 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, లెక్కల మాస్టారు సుకుమార్‌ కలయికలో వస్తున్న మూడో చిత్రం 'పుష్ప'. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన 'పుష్ప ఇంట్రడక్షన్‌'కు విశేష స్పందన లభించింది. మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్‌ సుకుమార్‌.. పుష్పరాజ్‌తో మతిపోగొట్టే బోట్‌ఫైట్‌ చూపించబోతున్నారట.

ఇంట్రడక్షన్‌ వీడియోతోనే మాస్‌ యాక్షన్‌ను రుచి చూపించిన సుకుమార్‌ యాక్షన్‌ సన్నివేశాల విషయంలో ఎక్కడా తగ్గకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఇప్పటివరకూ భారతీయ సినిమా చరిత్రలో ఎవరూ చూపించని విధంగా ఓ ఫైట్‌ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారట. తెలుగు సినిమాలకు బోట్‌ఫైట్‌ ఇదే తొలిసారి కాకపోయినప్పటికీ.. థియేటర్లో ప్రేక్షకులు థ్రిల్‌కు గురయ్యేలా ఫైట్‌ సన్నివేశం చిత్రీకరించాలని సుకుమార్‌ భావిస్తున్నారట. దానికోసం ఇప్పటికే ఫైట్‌ మాస్టర్లతో కలిసి ప్రణాళికలు వేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి.!

'పుష్ప' మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరగడం.. లాక్‌డౌన్‌ విధింపుతో సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. ఇప్పుడు మిగతా షూట్‌ పూర్తి చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా కీలకపాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది.

ఇవీ చూడండి: సుధీర్​.. రష్మీని పెళ్లెపుడు చేసుకుంటావ్?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.